Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)ను అభినందిస్తూ ప్రముఖ హీరో సూర్య లేఖ
- రాజకన్ను సతీమణికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
న్యూఢిల్లీ : ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన, ప్రజాదరణ పొందిన 'జై భీమ్' చిత్రంలో కమ్యూనిస్టులను కీలకంగా చూపించారని సీపీఐ(ఎం) ట్వీట్ చేసింది. ప్రధాన స్రవంతికి చెందిన పలు ఇతర చిత్రాల్లో కమ్యూనిస్టుల నేతృత్వంలో సాగిన పోరాటాలు చూపిస్తారు కానీ వారి పాత్రను చూపించరని పార్టీ వ్యాఖ్యానించింది. 'జై భీమ్' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన ప్రముఖ నటుడు సూర్య సీపీఐ(ఎం)ను అభినందిస్తూ ఒక లేఖ రాశారు. అణగారిన వర్గాలకు కమ్యూనిస్టు పార్టీలు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచాయని ప్రశంసించారు. జై భీమ్ చిత్రంలో చూపించిన నిజ జీవిత గాథలోని రాజకన్ను భార్య పార్వతికి సాయం చేసేందుకు సూర్య ముందుకొచ్చారు. ఆమె పేరిట రూ.10 లక్షలను డిపాజిట్ చేశారు.