Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ నుంచి రిలీవ్ అయిన ఉద్యోగులను చేర్చుకోకపోవటంపై..
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీవ్ అయిన వేర్వేరు శాఖల ఉద్యోగులను చేర్చుకోక పోవడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పదోన్నతులు, ఇతర అంశాలపై ఉమ్మడి ఏపీలో నియమితులైన ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వారిలో 12 మందిని తెలంగాణకు కేటాయిస్తూ జులైలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆయా ఉద్యోగులను ఆగస్టులో రిలీవ్ చేసింది. సదరు ఉద్యోగులు ఆగస్టు 23న తెలంగాణలోని సంబంధిత శాఖల్లో రిపోర్టు చేశారు. ఇప్పటికీ వారికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను ఇటీవల జస్టిస్ ఉదరు ఉమేష్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. డిసెంబరు 8లోగా వివరణతో కూడిన అఫిడవిట్ చేయాలని తెలంగాణ సీఎస్‌ను ఆదేశిస్తూ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.