Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్, వియత్నాం, కొలంబియాలో ప్రతికూల పరిస్థితులు
- రానున్న రోజుల్లో కాఫీ ధరల కొత్త రికార్డులు : నిపుణులు
న్యూఢిల్లీ: కాఫీ ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా కాఫీ ధరలు ఏడేండ్ల గరిష్టారికి చేరాయి. అంతర్జాతీయంగా సంబంధిత ఆయా మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలు సైతం కాఫీ ధరలు మరింతగా పెరిగేందుకు కారణమయ్యాయని బ్లూమ్బర్గ్ నివేదిక పేర్కొంది. కాఫీతో పాటు ముడిచక్కెర ధరలు సైతం గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపింది. ఐసీఈ ఫ్యూచర్స్ యూఎస్ గిడ్డంగులలో కనిష్టానికి పడిపోయిన నిల్వల కారణంగా అరబికా కాఫీ గురువారం పౌండ్కి 4.8 శాతం పెరిగి ఏడేండ్ల గరిష్టానికి చేరింది. 2014 అక్టోబర్ తర్వాత ఆ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటిసారి. కాఫీ ధరలు పెరగడానికి, సంబంధిత మార్కెట్ వర్గాల్లో నెలకొన్ని అనిశ్చితి సైతం కొంత కారణమైందని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. మరీ ముఖ్యంగా బ్రెజిల్, వియత్నాం దేశాల పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ఈ సంవత్సరం కాఫీ ధరలతో పాటు ముడి చక్కెర ధరలు పెరగడానికి బ్రెజిల్లో సంభవించిన కరువులు, ప్రకృతి విపత్తులు కారణమాయ్యాయి. ఎందుకంటే ప్రపంచ అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారుగా ఈ దేశం వుండటమే. ఈ ఏడాది జులైలో అక్కడ అత్యంత కరువు పరిస్థితులు సంభవించాయి. శతాబ్దలోనే అత్యంత దారుణమైన కరువు పరస్థితులు అని పలు నివేదికలు సైతం పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల కారణంగా కాఫీ మొక్కలు ఎండిపోవడం.. పంట తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం పడింది. 2022 కాఫీ పంట ముందస్తు అంచనాలు 2020-21 చివరల్లో వచ్చిన దిగుబడిని అనుసరిస్తాయని సూచిస్తున్నాయి. దీంతో నిల్వలపై ప్రభావం పడనుంది.'గ్లోబల్ కాఫీ మార్కెట్లు లోటులో ఉన్నాయి. ధరలు తగ్గినప్పుడల్లా పరిశ్రమలు పరిస్థితులు ప్రతికూలం కాకముందే కొనుగోలు చేయడానికి చూస్తాయి'' అని లండన్లోని కమోడిటీ ట్రేడర్ ఈడీ అండ్ ఎఫ్ మన్ పరిశోధనకు నాయకత్వం వహిస్తున్న కోనా హక్ అన్నారు.