Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాయుకాలుష్యంపై సమావేశంలో ఢిల్లీ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ : దేశరాజధాని ప్రాంతంలో వాయుకాలుష్యం తగ్గించడానికి వర్క్ ఫ్రం హోం, పరిశ్రమల మూసివేత వంటి చర్యలను ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఢిల్లీలోని వాయుకాలుష్యంపై జరిగిన అత్యవసర సమావేశంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రతిపాదలను చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై 24 గంటల్లోగా అత్యవరస సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లతో అత్యవసరం సమావేశం ఏర్పాటు చేశారు. 'ఈ సమావేశంలో మేం వారాంతపు లాక్డౌన్ విధించాలని ప్రతిపాదించాం. దాన్ని అమలు చేసేందుకూ సిద్ధంగా ఉన్నాం. మా తదుపరి నిర్ణయాలు కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటాయి' అని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రారు మీడియాకు చెప్పారు. అలాగే నగరవ్యాప్తంగా నిర్మాణాలు నిలిపివేస్తామని చెప్పారు. కాగా, ఢిల్లీ వాయుకాలుష్యంపై బుధవారం సుప్రీంకోర్టు తన విచారణ కొనసాగించనుంది.