Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షాలతో నష్టపోయిన రైతులకు సహాయం ప్రకటించిన స్టాలిన్
చెన్నై : ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న రైతులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మంగళవారం సహాయం ప్రకటించారు. కోతలకు సిద్ధంగా ఉండి, వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ. 20 వేల ఆర్థిక సహాయం అందచేస్తామని తెలిపారు. అలాగే వర్షపు నీరు చేరి పంటలను కోల్పోయిన రైతులకు రూ.6,038 విలువైన వ్యవసాయ ఇన్పుట్లు అందచేయనున్నట్లు చెప్పారు.
వీటిలో స్వల్పకాలిక వరి రకం విత్తనాలు (రూ. 1,485 విలువైన 45 కిలోలు), సూక్ష్మపోషకాలు (రూ. 1,235 విలువైన 25 కిలోలు), యూరియా (రూ. 354 విలువైన 60 కిలోలు), డిఎపి (రూ. 2,964 విలువైన 125 కిలోలు) వుంటాయని చెప్పారు. ఈ వ్యవసాయ ఇన్పుట్లు రైతులు మళ్లీ సాగు చేసుకోవడానికి సహాయపడతాయని అన్నారు. అలాగే వర్షాలతో దెబ్బతిన్న రహదారులు, కాలువలను మరమ్మత్తు చేయడానికి రూ. 300 కోట్లను స్టాలిన్ ప్రకటించారు. వర్షాల నష్టాలను అంచనా వేసిన ఆరుగురు సీనియర్ మంత్రుల బృందంతో సమావేశమైన తరువాత ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సహాయాలను ప్రకటించారు.