Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిశా, బెంగాల్లో అత్యధికం..
- ఈ-శ్రామ్ పోర్టల్‌లో ఇప్పటివరకు 7.7 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్డౌన్ దుర్భల పరిస్థితుల నేపథ్యంలో అసంఘటిత కార్మికుల గుర్తింపు కోసం ఆధార్‌తో అనుసంధానించబడిన రిజిస్ట్రేషన్ డేటాబెస్ 'ఈ-శ్రామ్' పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చింది. ఇందులో ఇప్పటివరకు మొత్తం 7.7 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అసంఘటిత కార్మికుల్లో దాదాపు 20 శాతం రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఒడిశా, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్లు ముందున్నాయి. లక్ష్యంగా పెట్టుకున్న 38.37 కోట్ల అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌లో ఒడిశా 87 శాతం కవరేజీతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న బెంగాల్లో 65 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 33శాతం, బీహార్‌లో 25 శాతం కవరేజీతో ఉన్నాయి. ఈ-శ్రామ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న తర్వాత యూనివర్సల్ ఖాతా నెంబర్‌తో ఈ-శ్రామ్ కార్డు వస్తుంది. దీనికి దేశంలో ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది. దీనిని వివిధ సామాజిక భద్రతా పథకాలతో లింక్ చేయడానికి ఉపయోగించు కోవచ్చు.
అలాగే, ప్రమాద బీమా లభిస్తుంది. ఇందులో రిజిస్టిర్ చేసుకున్న కార్మికుడు ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం లేదా మరణానికి 2 లక్షల బీమా అందుతుంది. అలాగే, పాక్షిక వైకల్యానికి గురైతే రూ.1లక్ష సాయం అందుతుంది. సంబంధిత మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లా డుతూ.. 'ప్రభుత్వం 38.37 కోట్ల అసంఘటిత కార్మికల రిజిస్ట్రేషన్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలి.