Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరీలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా, మరో ఇద్దరు లవ్ కుష్, ఆశిష్ పాండేలకు బెయిల్ ఇవ్వడానికి జిల్లా కోర్టు నిరాకరించింది.నిందితులు సమర్పించిన బెయిల్ దరఖాస్తుకు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ తన వాదనలను వినిపిస్తూ రైతులను నరికివేయడం,చంపడం,గాయపరచడం కుట్రగా కనిపిస్తున్నదనీ, కేవలం ప్రమాదం కాదని అన్నారు.తన వాదనలకు మద్దతుగా ఆశిష్ మిశ్రా, అంకిత్ దాస్లకు చెందిన కేసులో స్వాధీనం చేసుకున్న4 ఆయుధాల ఫోరెన్సిక్, బాలిస్టిక్ నివేదికతో పాటు 60మంది ప్రత్యక్ష సాక్షుల రికార్డెడ్ స్టేట్మెంట్లను ప్రాసిక్యూషన్ బృందం సమర్పించింది. కుట్ర సూత్రధారి అయిన అజరు మిశ్రా తేనిని అరెస్టు చేసి, తొలగించాలని ఎస్కేఎం మరోసారి డిమాండ్ చేసింది.అజరు మిశ్రా నేటికీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం దేశానికే సిగ్గుచేటని పేర్కొంది.