Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : పార్వతి అమ్మాల్..పోలీసుల దాడులతో తన భర్తను కోల్పోయి న్యాయవేత్త జస్టిస్ చంద్రు సాయంతో వ్యవస్థపై పోరాడి విజయం సాధించిన ఆదివాసీ ధీర మహిళ. జై భీమ్ చిత్రానికి ప్రేరణ అయిన పార్వతి అమ్మాల్, ఆమె భర్త రాజకన్ను కథ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించకమానదు. నిజజీవితంలో ఎన్నో కష్టాలు పడ్డ పార్వతి అమ్మాల్‌ను ఆర్థికంగా ఆదుకోవాలని సిపిఎం తమిళనాడు రాష్ట్ర కమిటీ భావించంది. ఇదే విషయాన్ని 'జై భీమ్' చిత్ర కథానాయకుడు, నిర్మాత సూర్య దృష్టికి తీసుకెళ్లింది. సానుకూలంగా స్పందించిన సూర్య నిజజీవిత చిన్ని తల్లి అయిన పార్వతి అమ్మాళ్కు రూ.15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సంబంధిత పత్రాలను సిపిఎం పొలిట్‌బ్యూరో జి రామకృష్ణన్, సిపిఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్ చేతుల మీదుగా పార్వతి అమ్మాల్‌కు అందజేశారు. సూర్యకు పార్టీ రాష్ట్ర కమిటీ తరపున వారు కృతజ్ఞతలు తెలిపారు.కుల వివక్షను తీవ్రంగా ప్రశ్నించిన 'జై భీమ్' చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో సూర్యపై దాడులు చేస్తామంటూ మితవాద, కులతత్వ వాదులు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ పరిస్థితిలో సూర్యకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని సిపిఎం నాయకులు ప్రకటిం చారు. పిఎంకె, మితవాద గ్రూపుల నుండి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సూర్య ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కల్పించింది.