Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈనెల 22న జరగబోయే కిసాన్ మహాపంచాయత్ కోసం ఎఐకెఎస్, బికెయు, ఎఐకెఎం, ఎఐకెఎంఎస్ తదితర రైతు సంఘాలు సమీకరణ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. యుపిలోని దేవరియా జిల్లాలో ఎఐకెఎస్ సమావేశంలో కోశాధికారి కష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. అమేథీ, ఆగ్రాలో జరిగిన ఎఐకెఎస్ సమావేశాల్లో అశోక్ దావలే పాల్గొన్నారు. అలీఘర్, ఆగ్రా, అమేథీ, డియోరియా, ముజఫర్‌నగర్, ప్రయాగ్‌రాజ్ తదితర జిల్లాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం హర్యానాలోని రేవారి వద్ద గంగైచా టోల్ ప్లాజాలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. రైతులు, క్రీడా ఔత్సాహికులతో పాటు వాలీబాల్ టీమ్‌లు, క్రీడాకారులను ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఎస్‌కెఎం పిలుపు ఇచ్చింది.
భివానీలో రాష్ట్రపతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన బిజెపి, జెజెపి నేతలకు వ్యతిరేకంగా స్థానిక రైతులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. హర్యానాలోని షాహీద్ భగత్ సింగ్ చౌక్‌లో రైతులు సిఎం, డిప్యూటీ సిఎం, వ్యవసాయ శాఖ మంత్రి దిష్టిబొమ్మలను దహనం చేశారు. టిక్రీ బోర్డర్ వద్ద జరుగుతున్న ఉద్యమంలో 65 ఏళ్ల నిహాంగ్ సిక్కు నిరసనకారుడు హర్చరణ్ సింగ్ మరణించారు. ఆయన పంజాబ్‌లోని మాన్సా జిల్లా వాసి. మొదటి నుండి కొనసాగుతున్న రైతుల ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నాడు. నిహాంగ్ మరణం పట్ల ఎస్‌కెఎం తీవ్ర సంతాపం ప్రకటించింది. కాగా లఖింపూర్ ఖేరీ ఘటనను దర్యాప్తు చేస్తున్న సిట్‌లో పద్మజా చౌహాన్‌ను చేర్చడంపై ఎస్‌కెఎం వ్యతిరేకించింది. రైతులపై అనేక సార్లు కేసులు నమోదు చేసినను తొలగించాలని కోరింది.