Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ
ముంబయి : క్రిప్టో కరెన్సీని నియంత్రించడానికి అంతర్జాతీయ చట్టం అవసరమని ప్రధాని మోడీ గురువారం స్పష్టం చేశారు. 'క్రిప్టో కరెన్సీపై అన్ని ప్రజాస్వామ్య దేశాలు పనిచేయడం అవసరం. క్రిప్టో కరెన్సీ యువతను నాశనం చేయకుండా నియంత్రించాలి' అని గురువారం వర్చువల్గా జరిగిన సిడ్నీ చర్చలు సమావేశం ప్రారంభోపన్యాసంలో ప్రధాని మోడీ తెలిపారు.
ప్రపంచంలో శాంతిభద్రతల పరిస్థితిపై, సైబర్- క్లిష్టమైన సాంకేతికతల సమస్యలపై చర్చించడానికి ఏడాదికి ఒకసారి సిడ్ని వార్షిక శిఖరాగ్ర సమావేశాలను నిర్వహిస్తారు.
ఈ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ భారత అంతరిక్ష రంగం ప్రైవేటు పెట్టుబడులకు తెరతీసిందని, డిజిటల్ విప్లవం వల్ల వ్యవసాయ రంగం లాభాలను పొందుతుందని తెలిపారు. భారత దేశ డిజిటల్ విప్లవం పురోగతిని మోడీ ప్రస్తావించారు, ఇదే సమయంలో 'వ్యక్తిగత హక్కుల' పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు.
'మన ప్రజాస్వామ్యం, మన జనాభా, మన ఆర్ధిక వ్యవస్ధల్లో భారత దేశ డిజిటల్ విప్లవం పాతకుపోయింది. డిజిటల్ యుగం మన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని మారుస్తోంది. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజాన్ని ఇది పునర్నిర్వచించింది.సార్వభౌమాధికారం, పరిపాలన, నైతికత, చట్టం, హక్కులు, భద్రతపై కొత్త ప్రశ్నలు రేపుతోంది' అని మోడీ తెలిపారు.
పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యయసాయం వంటి అత్యంత విస్తృతమైన రంగాల్లో ఐదు రెట్లు డిజిటల్ డొమైన మార్పులను భారతదేశం అనుభవిస్తోందని మోడీ చెప్పారు.
భారతదేశంలో పరిశ్రమలు, సేవల రంగాలు, వ్యవసాయం కూడా భారీ ఎత్తున్న డిజిటల్ మార్పులకు గురవుతున్నాయని, స్వచ్ఛమైన ఇంధన పరివర్తన, వనరుల పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ కోసం డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు కూడా మోడీ తెలిపారు.