Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోని 80 శాతం ఉద్యోగుల పరిస్థితి ఇదే..
- ఇందులో 34 శాతం మంది వేతనం నెల మధ్యలోనే ఖర్చు
- పెరిగిన జీవన వ్యయం.. అందని కనీస వేతనం : ఈవై-రిఫైన్ సర్వే
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగులు చాలిచాలని వేతనాలలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, కనీస వేతనం అందుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందనీ, ఇది వారి జీవనాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఇటీవలే పలు సర్వేలు పేర్కొన్నాయి. తాజాగా మరో సర్వే దేశ ఉద్యోగుల దీన ఆర్థిక పరిస్థితిని వివరించే నివేదికను విడుదల చేసింది. ఈవై-రిఫైన్ సర్వే నివేదిక వివరాల ప్రకారం.. దేశంలోని 80 శాతం మంది భారతీయ ఉద్యోగుల్లో వారి వేతనం నెలలోపు ఖర్చవుతున్నది. అలాగే, 34 శాతం మంది ఉద్యోగుల జీతం నెల మధ్యలోనే అయిపోతున్నదని ఈ సర్వే ద్వారా వెల్లడైంది. కేవలం 13 మంది శాతం మాత్రమే తమ పే చెక్కుల నుంచి తగిన మొత్తాన్ని ఆదా చేసుకోలగుతున్నారని వెల్లడైంది. ''ఎప్పటికప్పుడూ పెరుగుతున్న జీవన వ్యయం, జీవనశైలి ఖర్చులను కోల్పోతారనే భయం, పేలవమైన ఆర్థిక ప్రణాళిక, దారుణమైన రుణ చక్రంలో భారతీయ ఉద్యోగులు చిక్కుకోవడంతో వారి అందుతున్న జీతాలతో నెలాఖరు వరకు కూడా నగదు ప్రవహాన్ని కొనసాగించడం కష్టతరం చేస్తున్నది'' అని ''ఎర్న్డ్ వేజ్ యాక్సెస్ ఇన్ ఇండియా: ది ఫైనలియర్ ఫ్రాంటియర్ ఆఫ్ ఎంప్లాయి వెల్బీయింగ్'' పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది.మొత్తం 3,010 మంది జీతభత్యాలు పొందుతున్న భారతీయ ఉద్యోగుల ప్రతిస్పందనల ఆధారంగా ఈ సర్వే కొనసాగింది. కేవలం 38 శాతం మంది మాత్రమే తమ ఆర్థిక శ్రేయస్సుపై నియంత్రణలో ఉన్నారని అధ్యయనం చెబుతోంది. ఇక ఆసక్తికర విషయం ఏమిటంటే ఆర్థిక ఒత్తిళ్లు కేవలం తక్కువ ఆదాయ వర్గాలకు మాత్రమే పరిమితం కాలేదని ఈ నివేదిక వెల్లడించింది. నెలకు రూ.1 లక్ష కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారిలో దాదాపు 60 శాతం మంది తమ నెలవారీ జీతం తమ అన్ని ఖర్చులను భరించడానికి సరిపోవటం లేదని తెలిపారు.
నెలకు రూ.15,000 కంటే తక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులు అధిక ఆదాయ గ్రూపు ఉద్యోగుల కంటే ఆరు రెట్లు ఎక్కువ అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశముందని ఈ నివేదిక పేర్కొంది. 75 శాతం మంది వారికి అందుతున్న జీతం సరిపోవడం లేదని చెప్పారు. తమ జీవిత ఖర్చులను కూడా తీర్చుకోకపోతున్నామని సర్వేలో పాల్గొన్న 75 శాతానికి పైగా ఉద్యోగులు వెల్లడించారు. అత్యవసర సమయాల్లో ఫైనాన్స్ ఇచ్చే వారిని ఆశ్రయించడం చేస్తున్నామనీ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికేతర ఖర్చులు సైతం గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు.