Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కూల్స్, కాలేజీలు మూసివేత
చెన్నై : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తమిళనాడులో వర్షం బీభత్సం సష్టిస్తోంది. భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన 16 జిల్లాల్లో కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరుతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలు కూడా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఇక పెరంబలూరు, అరియలూరు, ధర్మపురి, తిరపత్తూరు, వెల్లూరు, రాణిపేట్లలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండి) వెల్లడించింది.