Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలయంలో రెండడుగులు నీటిని తోడిన ఫైరింజన్లు
- 50ఏండ్లలో ఇంత వర్షం చూడలేదు
తిరుమల :తిరుమల కొండపై జలప్రళయం ముంచెత్తింది. శ్రీవారి అలయంతో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆలయంలో రెండడుగులు నీరు చేరడంతో ఫైర్ ఇంజన్లు సాయంతో నీటిని వెలుపలకు తోడారు. బాలాజీ నగర్ ప్రాతంలో నీరు ఒక్కసారిగా ఇండ్లలోకి చేరడంతో దిక్కు తోచని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన చెందారు.తాము తమ జీవిత కాలంలో ఇటువంటి వర్షం చూడలేదన్నారు. తిరుమల రెండు ఘాట్ రోడ్డుల్లో ఏడు ప్రాంతాలలో కొండరాళ్లు నేలకొరగడంతో ఘాట్ రోడ్డులు మూసేశారు. వాటిని తొలగించడం కోసం 10 జేసీబీ లను వినియోగిస్తున్నారు. ఇంత దారుణ పరిస్థితులు వస్తాయని టీటీడీ ఎన్నడూ ఊహించలేదు. పాపవినాశం తీర్థ దర్శనాలు ఇలాంటి పరిస్థితులు వస్తాయని గ్రహించి టీటీడీ ముందుస్తుగా మూసేసింది.