Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 600 ఏండ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం
న్యూఢిల్లీ : 600 ఏండ్ల తరువాత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. ఈ ఏడాది చంద్ర గ్రహణాల్లో ఇది చివరిది. శుక్రవారం ఉదయం 11.32 గంటలకు ప్రారంభం కానున్న చంద్రగ్రహణం ఆరు గంటల పాటు కొనసాగనుంది. భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా దీనిని దర్శించవచ్చు. అయితే దేశంలో అరుణాచల్ ప్రదేశ్, అసోం పరిసర ప్రాంతాల్లో మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో కొద్దిగా కొంచెం సేపు మాత్రమే కనిపించనుంది. పూర్తి గ్రహణం మధ్యాహ్నం 2.32 గంటలకు ఏర్పడి, సాయంత్రం 5.30 గంటలకు గ్రహణం ముగియనుంది. ఆరు గంటలపాటు కొనసాగిన ఇలాంటి సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం గతంలో 1440లో ఏర్పడింది. మళ్లీ 2489 అక్టోబర్ 9న ఏర్పడనుంది.