Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఎప్పటికైనా పార్లమెంట్ చర్చల్లో పాల్గొంటారా.. అని కాంగ్రెస్ నేత చిదంబరం గురువారం విమర్శలు సంధించారు. నాణ్యమైన చర్చల కోసం చట్ట సభల్లో ప్రత్యేక సమయాన్ని కేటాయించాలనే ఆలోచనను ప్రధాని మోడీ ప్రతిపాదించిన ఒక రోజు తరువాత చిదందరం విమర్శలు చేశారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన 82వ అఖిల భారత ప్రెసిడింగ్ ఆఫీసర్స్ సమవేశంలో ప్రధాని మోడీ ఈ ఆలోచన చేశారు.దీనిపై చిందంబరం స్పందిస్తూ 'పార్లమెంట్లో 'నాణ్యమైన చర్చలు' ఆవశ్యకతను ప్రధాని పేర్కొన్నారని వార్తలు రావడం ఆసక్తికరంగా ఉంది. నాణ్యమైన చర్చల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని కూడా ప్రధాని సూచించారు. 'ప్రధానమంత్రి ఎప్పుడైనా పార్లమెంట్ చర్చల్లో పాల్గొంటారా?' అని గురువారం ట్వీట్ చేశారు.