Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆహార, సరఫరా శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : పారాబాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయమని కేంద్ర ఆహార, పౌర సరఫరా మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ధాన్యం, బియ్యంకొనుగోలుపై తెలంగాణలో ఆందోళనల నేపథ్యంలో తమ వైఖరిని ఆ శాఖవర్గాలు వెల్లడించాయి. ''కేరళ, తమిళనాడు, బీహార్, ఒడిశారాష్ట్రాల్లో గతంలో పారాబాయిల్డ్ బియ్యం వినియోగం ఎక్కువగా ఉండేది. క్రమంగా తగ్గిపోయింది. ఆ రాష్ట్రాలకు అవసరమైన మేర ఆ రాష్ట్రాలే సేకరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ముందు పారాబాయిల్డ్ బియ్యం కొనుగోలు చేయం'' అని స్పష్టం చేశాయి. ''ప్రతి ఏటా ఖరీఫ్ (వానా కాలం పంట) ఆరంభంలోనే ఏ రాష్ట్రంలో ఏ ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? ఎంత ఉత్పత్తి వస్తుంది? కేంద్రం ఎంత సేకరించాలనే దానిపై ఆయా రాష్ట్రాల అధికారులతో సమావేశమై నిర్ణయిస్తాం. దానికి అనుగుణంగానే సేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. వానా కాలం పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) బియ్యం సేకరించాలని ఈ ఏడాది ఆగస్టు 17న కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. తరువాత కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పియూశ్ గోయల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. 90 ఎల్ఎంటీ బియ్యం కొనుగోలు చేయాలని కోరారు. తెలంగాణ అధికారులు 75 ఎల్ఎంటీ కొనుగోలు చేయాలని లేఖలు రాశారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, త్రిపుర, అస్సాం రాష్ట్రాల నుంచి బియ్యం ఎక్కువగా కొనుగోలు చేయాలనే డిమాండ్ వస్తోంది'' అని తెలిపాయి. ''ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వరి, గోధుమ విస్తీర్ణం ఎక్కువగా సాగు అవుతోంది. దేశీయ అవసరాలు, వినియోగం, నిల్వలు పోనూ ఎగుమతి చేస్తున్నాం. అయితే ఎగుమతులకు ఒక పరిమితి ఉంటుంది. దేశంలో పారాబాయిల్డ్ బియ్యం వినియోగం బాగా తగ్గిపోయింది. తెలంగాణ నుంచి గతేడాది 44.75 ఎల్ఎంటి పారాబాయిల్డ్ బియ్యం కొనుగోలు చేశాం. రాష్ట్రం నుంచి భవిష్యత్తులో పారాబాయిల్డ్ బియ్యం ఇవ్వమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. పంజాబ్ పండించిన వరిలో 90 శాతం కొనుగోలు చేశారనే వాదన వినిపిస్తున్నారు. పంజాబీయుల ప్రధాన ఆహారం వారి కాదు. వారు గోధుమ ఎక్కువ వినియోగిస్తారు. తెలంగాణలో వరినే ప్రధాన ఆహారం. అందుకే కొనుగోళ్లు, సేకరణ విషయంలో పంజాబ్, తెలంగాణను పోల్చడం సరికాదు'' అని తెలిపారు. ''వేసంగ్ (రబీ) పంటకు సంబంధించి ఏ రాష్ట్రం నుంచి ఏ ఏ పంటలు ఎంత కొనుగోలు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు సమావేశమై ఒక ఒప్పందానికి వస్తారు. తరువాతే ఏ రాష్ట్రం నుంచి ఏ పంట ఎంత మేర కొనుగోలు చేయాలనే నిర్ణయం ఖరారవుతుంది. దేశవ్యాప్తంగా వరి, గోధుమ సాగు విస్తీర్ణం బాగా పెరగడంతో ఉత్పత్తి పెరిగింది. నిల్వలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం దేశంలో వినియోగానికి పప్పులు, నూనె గింజలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ మన అవసరాలు, వినియోగానికి పోనూ వాటిని ఎగుమతి చేసుకునే స్థాయికి మనం ఎదగాలి. దేశ ప్రయోజనాల .........దష్ట్యా పప్పులు, నూనె గింజల పంటలు సాగు పెంచాలి. పంటల వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి వేసంగి పంటలోనూ వరి, గోధుమ పంట పండించడంతో నీటి వనరుల తోడకం ఎక్కువవుతోంది. ఈ అంశాన్ని దేశ ప్రయోజనాల .............దష్ట్యా అన్ని రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈక్రమంలో పప్పులు, ఆయిల్ వంటి పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం'' అని అధికార వర్గాలు వెల్లడించాయి.