Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంపై.. పలువురు ముఖ్యమంత్రులు, కీలక నేతల నుంచి విభిన్న స్పందన కనిపిస్తున్నది. ప్రధాని ప్రకటనపై తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ కూడా స్పందించారు. 'వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ.. గత కొన్నినెలలుగా రైతుల చేస్తున్న ఆందోళనల ఫలితమే కేంద్రం వెనక్కి తగ్గడానికి కారణం. ఇది రైతులు సాధించిన గొప్ప విజయం' అని వ్యాఖ్యానించారు. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను తప్పనిసరిగా గౌరవించాలని పేర్కొన్నారు. రైతులు తమ డిమాండ్ల కోసం ఆందోళనలు చేసి.. కేంద్రం మెడలు వంచడం ఒక చరిత్ర. ఈ చట్టాల రద్దు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తునట్టు తెలిపారు.