Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లుగానే, జమ్మూ కాశ్మీర్‌పై ఆగస్టు 5, 2019న తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) శుక్రవారం విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ చట్టాల రద్దుపై ఎన్సీ నేత, పార్లమెంటు సభ్యుడు హస్నైన్ మసూది శుక్రవారం స్పందిస్తూ 'అహంకార రాజకీయాల నుంచి ఆత్మపరిశీలన, పునర్వి మర్శకు ఇది స్పష్టమైన మార్పు' అని తెలిపారు. ఆగస్టు 05, 2019న కేంద్రం తీసుకున్న నిర్ణయాల విషయంలోనూ ప్రధాని మోడీ ఇలాంటి ఆత్మపరిశీలన చేసుకోవాలి అని పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌కు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా, అనైతికంగా ప్రత్యేక హోదాను రద్దు చేసి, విభజించి, కేంద్ర పాలిత ప్రాంతానికి తగ్గించిన నిర్ణయా లను ఉపసంహరించుకోవాలని మసూది డిమాండ్ చేశారు.