Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీ ఆదాయంపై పన్ను వేసే విధంగానూ ఆదాయ పన్ను చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరించనున్నది. వచ్చే బడ్జెట్లోనే నూతన సవరణలను అమలుచేసే అవకాశంఉంది. ఈ విషయాన్ని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ శుక్రవారం వెల్లడించారు. ఆదాయపు పన్ను పరంగా, క్రిప్టోకరెన్సీ ద్వారా వచ్చే ఆదాయంపై ఇప్పటికే కొంత మంది క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లిస్తున్నారని తరుణ్ బజాజ్ చెప్పారు. 'మేము త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికే కొంతమంది దానిపై (క్రిప్టో కరెన్సీ ఆదాయం) పన్నులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఇది మరింతగా పెరిగింది కాబట్టి, చట్టంలో కొన్ని మార్పులపై ఆలోచన చేస్తున్నాం' అని ఒక ఇంటర్వ్యూలో బజాజ్ తెలిపారు. 'మీరు డబ్బు సంపాదిస్తే తప్పకుండా పన్నులు చెల్లించాలి. ఇప్పటికే కొందరు దానిని (క్రిప్టో కరెన్సీ)ని ఆస్తిగా పరిగణించారు. దానిపై మూలధన లాభాల పన్ను చెల్లించారు' అని తరుణ్ బజాచ్ చెప్పారు.