Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరద నీటిలో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు
- అన్నమయ్య జలాశయానికి గండి
విజయవాడ : ఏపీలో వర్షబీభత్సం దెబ్బకు అక్కడి ప్రజలు బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. నదులు,వాగులు పొంగిపొర్లుతున్నాయి. కడప జిల్లాలోని రాజంపేట వద్ద ఆర్టీసీబస్సు వరదనీటిలో కొట్టుకుపోయింది. దాదాపు 30 మంది ప్రయాణికులతో ఉన్న బస్సులో 12 మంది జల సమాధి అయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. నందలూరు పరివాహక ప్రాంతంలోని మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో 3 ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులోని కండక్టర్, ఇద్దరు ప్రయాణికులు వరద నీటిలో కొట్టుకుపోయారు. వరద ఉధృతికి జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు, శేషమాంబాపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. దీంతో చెయ్యేరు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.