Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
న్యూఢిల్లీ : సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం ఆధ్వర్యంలో రైతులు ఏడాది కాలంగా స్ఫూర్తివంతంగా, సాహసోపేతంగా సాగించిన పోరాటానికి లభించిన చారిత్రక విజయం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) పొలిట్‌బ్యూరో అభినందనలు తెలియచేసింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది.రైతాంగం రాజధాని సరిహద్దుల్లో సుదీర్ఘంగా పోరాటం సల్పుతున్నా ఇంతవరకు పట్టనట్లు వ్యవహరించిన ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వం ఇప్పుడు తల వంచక తప్పని పరిస్థితి ఏర్పడిం దని పేర్కొంది. కొంతమంది రైతులు ఈ చట్టాలను తప్పుదారి పట్టించేలా ప్రచారం చేస్తున్నారంటూ మోడీ ఈ నల్ల చట్టాలను సమర్ధించుకోవడానికే ప్రయత్నించారు. మన రైతుల మరణాల పట్ల లేదా వారిపై జరిగిన దాడుల పట్ల ఒక్కసారి కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని ఆ ప్రకటన పేర్కొంది. ఈ నల్ల చట్టాలను రద్దు చేస్తూనే, అన్ని వ్యవసాయ పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకునేందుకు రైతులకు చట్టబద్ధమైన హక్కును పార్లమెంట్ కల్పించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ రైతాంగ పోరాటంలో750మందికి పైగా రైతులు అమరులయ్యారు.మిలటరీ తరహాలో రహదారుల దిగ్బంధనాలు,బెదిరింపులు,అడ్డగింపులు, అవరోల ధాలు, హత్యా భౌతిక దాడులు వంటి వాటితో బీజేపీ యంత్రాంగం నుంచి వారు తీవ్ర ఘర్షణాయుత పరిస్థితులను ఎదుర్కొన్నారని ఆ ప్రకటన పేర్కొంది.మన రైతాంగం కృత నిశ్చయాన్నిసీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రశంసించింది.రైతులు పోరాటాన్ని విరమించి, తమ గ్రామానికి తిరిగి వెళ్ళడానికి ముందుగా మోడీ ఇచ్చిన ఈ హామీలు సాకారమయ్యేలా చూసేందుకు వేచి వుండాలన్న సంయుక్త కిసాన్ మోర్చా వైఖరిని పొలిట్‌బ్యూరో సమర్ధించింది.
ఐద్వా అభినందనలు !
రైతాంగ ఉద్యమం, సంయుక్త కిసాన్ మోర్చా సాధించిన విజయానికి ఐద్వా అభినందనలు తెలియచేసింది. ఓర్పుతో, సంయమనంతో ఏడాది కాలంగా రైతులు పోరాటం సాగించిన పరిస్థితుల్లో,పలువురు ప్రాణ త్యాగాలు చేసిన నేపథ్యంలో, ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకు ంటామని మోడీ ప్రకటించాల్సిన పరిస్థితు లు ఏర్పడ్డాయి. ఈ చారిత్రక పోరులో భుజం భుజం కలిపి ధైర్యంగా పోరాడిన వేలాదిమంది మహిళలను ఐద్వా అభినందించింది. లఖింపూర్ ఖెరి ఘటనలో, ఇంకా ఇతర చోట్ల తమ సహచరులపై జరిగిన దాడులను మర్చిపోరాదన్న రైతుల కృతనిశ్చయానికి మద్దతు తెలియచేసింది.