Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్కేఎం నేతృత్వంలో చారిత్రాత్మక కిసాన్ పోరాటం
- చట్టాల రద్దు, దేశానికి క్షమాపణ చెప్పాలని ప్రధానిని బలవంతం చేసింది : సీఐటీయూ
న్యూఢిల్లీ : రైతు ఉద్యమం విజయం దేశంలో శ్రమిస్తున్న ప్రజల విజయమని సఖీఐటీయూ పేర్కొంది. ఎస్కేఎం నేతృత్వంలోని చారిత్రాత్మ కిసాన్ పోరాటం వ్యవసాయ చట్టాల ఉపసంహరణను ప్రకటించాలని, దేశానికి క్షమాపణ చెప్పాలని ప్రధానమంత్రి మోడీని బలవంతం చేసిందని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ప్రకటన విడుదల చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోడీ చేసిన ప్రకటనకు స్పందిస్తూ పార్లమెంటరీ ప్రక్రియ చట్టం తీసుకురావాలని తెలిపింది. ''కార్మిక సంఘాలు, ప్రజల మద్దతుతో సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో రైతులు చేస్తున్న నిరంతర పోరాటంతో పాలక వ్యవస్థ ఒక అడుగు ముందుకు వేయవలసి వచ్చింది. తిరిగి ప్రధానిని దేశానికి క్షమాపణ చెప్పేలా చేసింది. సంపదను ఉత్పత్తి చేసే వర్గం, కార్మికులు, రైతులు ప్రజా వ్యతిరేక విధానాలను ఎన్నటికీ అంగీకరించరని ప్రభుత్వానికి ఇది స్పష్టమైన సందేశం'' అని పేర్కొన్నారు. ''అదే సమయంలో ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరిం చుకోవడం, ఎంఎస్పీపై చట్టబద్ధమైన చట్టంపై ప్రధానమంత్రి ప్రకటన మౌనంగా ఉంది. అవి కూడా కొనసాగుతున్న రైతుల పోరాటంలో ప్రధాన డిమాండ్లు. ఈ సమస్యలు తక్కువ ముఖ్యమైనవి కావు. తప్పక అంగీకరించాలి'' అని డిమాండ్ చేశారు. ''ఈ పోరాటంలో దాదాపు 700 మంది రైతులు తమ ప్రాణాలను అర్పించారు. లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టును దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అజరు మిశ్రా తేని ఇప్పటికీ మోడీ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నారు. హత్య నిందితులను వెంటనే కేసు నమోదు చేయాలి'' అని కోరారు.''చారిత్రాత్మకమైన ఐక్య పోరాటం చేస్తున్న రైతులను అభినందిస్తూ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక, రైతు ఉమ్మడి పోరాటాలు బలోపేతం చేయడానికి తమ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ఎస్కేఎం నాయకత్వం మద్దతుతో నవంబర్ 11న జరిగిన కార్మికుల జాతీయ సదస్సులో తీసుకున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రెండు రోజుల సమ్మె సంకల్పం శక్తిపై అపారమైన విశ్వాసంతో బలంగా అమలు చేయబడుతుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. కష్టాలు,విస్తృతమైన పేదరికం, ఆకలి, నిరుద్యోగం, శ్రమిస్తున్న ప్రజల, కార్మిక హక్కులు, ప్రజాస్వామ్య హక్కులను హరించి, ప్రజల పోరాటాలు, దూకుడు ప్రయివేటీకరణ డ్రైవ్, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపి) ప్రాజెక్టు వంటి జాతీయ మౌలిక సదుపాయాలు, ఆస్తులను అమ్మకానికి తీసుకొచ్చారు'' అని విమర్శించారు. ''ఎస్కేఎం భవిష్యత్తు పోరాటానికి తమ మద్దతు కొనసాగుతోందని స్పష్టం చేశారు.