Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంయుక్త కిసాన్ మోర్చా
న్యూఢిల్లీ : దేశంలోని రైతుల పోరాటం చారిత్రాత్మక విజయం సాధించిందని ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) హర్షం వ్యక్తం చేస్తూ.. శుక్రవారం ఒక ప్రక టన విడుదల చేసింది. మూడు రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ప్రధాని మోడీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. రైతుa పోరాటం దేశంలో ప్రజాస్వామ్యం,సమాఖ్య రాజకీయ పునరేఖీకరణకు బాటలు వేసిందన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కల్పనకు చట్టం తీసుకురావడ ంతో సహా రైతులు చేస్తున్న అన్ని న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. అప్పటి వరకూ పూర్తి స్థాయిలో తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎస్కేఎం సమావేశ ంలో భవిష్యత్ కార్యచరణ నిర్ణయిస్తామని తెలిపింది. రైతు ఉద్యమంలో అమరులైన దాదాపు675మంది అన్నదాతలకు ఈ సందర్భంగా ఎస్కేఎం నివాళులర్పించింది.అమరుల త్యాగం వృధా పోదని పేర్కొంది.
కొనసాగతున్న ఆందోళనలు
రైతు ఉద్యమాన్ని అణచేసేందుకు ప్రయత్నించిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం హర్యానాలోని హన్సిలో పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం వెలుపల ఆందోళనకు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నవంబర్5న బీజేపీ రాజ్యసభ ఎంపీ రామ్ చందర్ జంగ్రాకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన తెలిపిన ముగ్గురు రైతులపై ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. బీజేపీ నేత, ఎంపీ పిఎస్ఒపై కేసు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.అలాగే జంగ్రా నిరసన తెలిపే రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేశారు.