Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకుల్లో 40 లక్షలకుపైగా జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో ఉత్తమ సుస్థిరత మెగా సిటీగా గ్రేటర్ హైదరాబాద్ నిలిచింది. సఫాయి మిత్ర సురక్ష విభాగంలో 3 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో కరీంనగర్ జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ ర్యాంకులను శనివారం విడుదల చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రాల పనితీరులో ఏపీకి ఐదో ర్యాంకు, తెలంగాణకు పదో ర్యాంకు లభించింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ శనివారం రాష్ట్రపతి రామనాధ్ కోవింద్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పూరీ అవార్డులు అందజేశారు. ఈ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ 13వ ర్యాంకు దక్కించుకుంది. ఒకటి నుంచి పది లక్షల జనాభా ఉన్న నగరాల్లో కరీంనగర్‌కు 74వ, రామగుండం 82వ ర్యాంకు దక్కింది. గ్రేటర్ హైదరాబాద్ అవార్డును ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చేతులమీదుగా పురపాలక పట్టణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అందుకున్నారు. కరీంనగర్‌కు వచ్చిన అవార్డును భూపేష్ బఘేల్ చేతుల మీదుగా కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, కమిషనర్ యాదగిరిరావు అందుకున్నారు. ఈ అవార్డు కింద కరీంనగర్‌కు రూ. 4 కోట్ల చెక్కును అందజేశారు. పౌరసేవల పురోగతిలో చత్తీస్‌గఢ్ దేశంలో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 8వ స్థానాల్లో నిలిచాయి. సపాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ ర్యాంకుల్లో తెలంగాణకు రెండో ర్యాంకు దక్కింది. కంటోన్మెంట్ల ర్యాంకింగ్స్‌లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏడో ర్యాంకు సొంతంచేసుకుంది.
తెలంగాణ జిల్లాల ర్యాంకులు
తెలంగాణలోని హైదరాబాద్ జిల్లా (80 స్కోర్) ఆరో స్థానం, సిరిసిల్ల (60 స్కోర్) 80వ స్థానం, పెద్దపల్లి (55.46 స్కోర్) 117 స్థానం, కరీంనగర్ (53.69 స్కోర్) 139 స్థానం, వరంగల్ (53.46 స్కోర్) 142 స్థానం, నిజామాబాద్ (47.26 స్కోర్), 218 స్థానం, సిద్దిపేట (47.22 స్కోర్) 219 స్థానం, మేడ్చల్ (46.50 స్కోర్) 227 స్థానం, జైశంకర్ భూపాలపల్లి (45 స్కోర్) 246 స్థానం, మల్కాజ్గిరి (43.76 స్కోర్) 260 స్థానం, జగిత్యాల (43.32 స్కోర్) 264 స్థానం, సూర్యాపేట్ (43.26 స్కోర్) 265 స్థానం, నిర్మల్ (43.6 స్కోర్) 267 స్థానం, ఖమ్మం (42.76 స్కోర్) 267 స్థానం, మహబూబ్‌నగర్ (42.2 స్కోర్) 274 స్థానం, కామారెడ్డి (41.94 స్కోర్) 275 స్థానం, భద్రాద్రి కొత్తగూడె (41.81 స్కోర్) 276 స్థానం, నల్గొండ (41.11 స్కోర్) 283 స్థానం, మెదక్ (40.53 స్కోర్) 291 స్థానం, రాజన్న సిరిసిల్ల (40 స్కోర్) 297 స్థానం, రంగారెడ్డి (39.98 స్కోర్) 298 స్థానం, యాదాద్రి భువనగిరి (39.11 స్కోర్) 309 స్థానం, వికారాబాద్ (38.52 స్కోర్) 312 స్థానం, నారాయణ పేట (37.45 స్కోర్) 323 స్థానం, సంగారెడ్డి (37.26 స్కోర్) 325 స్థానం, మహబుబాబాద్ (37.14 స్కోర్) 326 స్థానం, జోగులంబా గద్వల్ (36.85 స్కోర్) 330 స్థానం, అదిలాబాద్ (35 స్కోర్) 345 స్థానం, జనగాం (35 స్కోర్) 349 స్థానం, కొమరం భీం (35 స్కోర్) 350 స్థానం, మంచిర్యాల (34.88 స్కోర్) 352 స్థానం, నాగర్‌కర్నూల్ (33.82 స్కోర్) 362 స్థానం, వనపర్తి (30.15 స్కోర్) 399 స్థానం, వరంగల్ రూరల్ (జీరో స్కోర్) 650 స్థానంలో నిలిచాయి.