Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలలు మూసివేత
న్యూఢిల్లీ : ఢిల్లీలో నెలకొన్న అత్యధిక వాయు కాలుష్యం కారణంగా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు పాఠశాలలను మూసివేయనున్నట్టు ఢిల్లీ విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్లైన్ తరగతులు కొనసాగుతా యని పేర్కొంది. నగరంలో ఈ రోజు ఉదయం 9.00 గంటలకు వాయు నాణ్యత సూచి (ఎఐఆర్) 382గా నమోదైంది.మరోసారి చాలా పేలవమైన గాలి నాణ్యత విభాగంలోకి పడిపోయింది.దీంతో రాజధాని పరిధిలోని ప్రాంతాల(ఎన్సీఆర్)తో పాటు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు అన్ని పాఠశాలలను తక్షణమే మూసివేయాలని పర్యావరణ శాఖ ఆదేశించింది.