Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : బహుముఖ ప్రత్యేకతలు కలగలసిన 'ఐఎన్ఎస్ విశాఖపట్నం' నౌక ముంబయిలో ఆదివారం జలప్రవేశం చేసింది. దేశంలోని హిందూ మహాసముద్ర తీరప్రాంత రక్షణకు ఈ నౌక భవిష్యత్తులో కీలకపాత్ర పోషించనున్నదని భారత నౌకాదళం పేర్కొంది. రెండు మల్టీరోల్ హెలీకాఫ్టర్లను ఇముడ్చుకోగల సత్తా దీనికి ఉంది. భారత తొలి స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్గా దీన్ని నావికాదళం అభివర్ణిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు నేవీ చీఫ్ కరంబీర్ సింగ్, వెస్టర్ నేవల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ సహా ఇతర నౌకాదళ ఉన్నతాధికారుల ద్వారా ముంబయి (డాక్‌యార్డు) నౌకాదళం (వెస్టర్ నావల్ కమాండ్)లో ఆదివారం జలప్రవేశం జరిగింది. ముంబయి మజగాన్ డాక్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నౌకను నిర్మించారు. ఈ నౌకలో 315 మంది నావికాదళ సిబ్బంది ఉంటారు. నౌకలకుప్రముఖ నగరాల పేర్లను పెట్టే సంప్రదాయానికి అనుగుణంగా దీనిని భారత రక్షణ దళం కేటాయిస్తూ 'ఐఎన్ఎస్ విశాఖపట్నం' అనే పేరు పెట్టారు. తూర్పునౌకాదళంలో ఇది కీలక పాత్ర పోషించనున్నది. బ్రహ్మౌస్ సూపర్ సానిక్ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులను ప్రయోగించేందుకు వీలైన నౌకగా చెప్పుకోవచ్చు. ఈ నౌక కదలికలను శత్రుదేశ రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన పరిజ్ఞానం ఉపయోగించినట్టు నావికాదళం తెలిపింది. జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా అత్యంత శక్తివంతమైన టోర్పెడోలను దీంట్లో పొందుపరిచారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజనాథ్సింగ్ మాట్లాడుతూ దేశ తీర భద్రతలో ఐఎన్ఎస్ విశాఖపట్నం శక్తివంతమైన పాత్రను పోషించగలదన్నారు. ఈ నౌక షిప్ బిల్డింగ్ నైపుణ్యాలతో అద్భుతంగా రూపుదిద్దబడిందని తెలిపారు. ప్రపంచంలోనే క్షిపణి విధ్వంసక నౌకల్లో అగ్రగామిగా ఉండగలదన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భారత నౌకానిర్మాణ కేంద్రాల్లో 41 నౌకల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రాజెక్టు15బి (పి 15-బి) పేరుతో మొత్తం నాలుగు అత్యంత అధునాతన నౌకలను భారత నావికాదళం తయారు చేస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకలు తయారవుతున్నాయి. ఈ యుద్ధనౌక ప్రారంభ కార్యక్రమానికి విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల తూర్పునౌకాదళ అధికారులతో కలిసి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.