Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్‌లో ఘటన.. ముగ్గురి అరెస్టు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెం డింగ్‌లో ఉన్న కూలీ డబ్బులు ఇవ్వాలని అడిగిన ఓ కార్మికుడి చేయిని నరికాడు ఓ యజమాని. ఈ ఘటన రేవా జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో నిర్మౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోల్మౌ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షెడ్యూల్డ్ కులానికి చెందిన బాధితుడు అశోక్ సాకేత్ ఇంతకు ముందు డోల్మౌ గ్రామంలో గణేష్ మిశ్రా వద్ద నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేశాడు. అతనికి అందాల్సిన పెండింగ్ వేతనాలను చాలా రోజుల నుంచి ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే పెండింగ్ వేతనాల విషయంలో శనివారం నాడు సాకేత్.. మిశ్రాను కలిశాడు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. యజమాని కార్మికుడు సాకేత్‌పై పదునైన ఆయు ధంతో దాడిచేసి.. అతని చేయి నరికేశాడు. నిందితుడు తెగిపడిన చేతిని దాచడా నికి ప్రయత్నించాడని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎఎస్పీ) శివకుమార్ వర్మ తెలిపారు. బాధిత కార్మికుడిని ఆస్పత్రికి తరలించి వైద్యం అంది స్తున్నారు. వైద్యుల బృందం శస్త్రచికిత్స తర్వాత తెగిన చేతిని తిరిగి జతచేసినట్టు తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి యజమానితో పాటు మరో ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి.. అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.