Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధికారత, స్వతంత్ర ఇస్తే..లక్ష్యాన్ని సాధించి చూపుతాం :కేంద్రానికి ఆఫీసర్స్ యూనియన్ లేఖ
న్యూఢిల్లీ : ఓఎన్జీసీ గ్యాస్, చమురు క్షేత్రాలను విదేశీ కంపెనీలకు అప్పజెప్పాలన్న కేంద్రం ప్రతిపాదనను ఓఎన్జీసీ అధికారుల సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. కంపెనీ ప్రధాన ఆస్తుల ను ప్రయివేటు పరం చేయడానికి బదులుగా కం పెనీకి సాధికారత, స్వతంత్రత కల్పించాలని సూచిం చింది. చమురు, సహజవాయు క్షేత్రాలను ప్రయివే టుకు అప్పజెప్పాలన్న ప్రతిపాదనను ఓఎన్జీసీ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఆఫీసర్స్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకించింది. కంపెనీకి విధించిన నియంత్రణలు, పరిమితులు ప్రయివేటుకు కేంద్రం విధించగలదా? అంటూ యూనియన్ ప్రశ్నించింది. ప్రయివేటీకరణపై నిర్ణయాన్ని సమీక్ష చేయాలని కోరుతూ కేంద్ర చమురు, సహజవాయు మంత్రి హర్దీప్ సింగ్‌కు లేఖ రాసింది. అందులో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
చమురు ఉత్పత్తిని పెంచేందుకంటూ ముంబయి హై అండ్ బేసిన్ శాటిలైట్ (బీ అండ్ ఎస్)కి చెందిన 60శాతం వాటాలతోపాటు ఆస్తుల నిర్వహణను అంతర్జాతీయ భాగస్వాములకు అప్పగిస్తున్నట్టు చమురు, సహజవాయు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అమర్నాథ్ కమిటీ నిర్ణయించింది. దీనిపై ఓఎన్జీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరపై ప్రభుత్వ విధానాన్ని, చిన్న, మారు మూల క్షేత్రాల ఉత్పత్తిని క్రమబద్ధీకరించేందుకు సమీక్ష చేపట్టాలని ఈ నెల 11న పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్‌కు యూనియన్ లేఖ రాసింది. సహజ వాయువు చిన్న క్షేత్రాల నిర్వహణ, ధరల విధానంలోనూ ఓఎన్జీసీకి పూర్తి స్వేచ్ఛనివ్వాలని కోరింది. ప్రయివేటు, విదేశీ కంపెనీలు నూతన చమురు క్షేత్రాలను సర్వే చేపట్టడానికి, బావులను తవ్వేందుకు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టవని, ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న చమురు క్షేత్రాలను ఆక్రమించుకునేందుకు యత్నిస్తాయని యూని యన్ ఆరోపించింది.
ప్రయివేటు ఆపరేటర్లు వాణిజ్యపరమైన అంశాలకు, ప్రస్తుతమున్న వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది. వాణిజ్యపరంగా ఆదాయం తగ్గగానే ఈ అండ్ పీ కంపెనీలు సహజవాయు క్షేత్రాలను వదులుకున్నాయని, వాటి లీజ్‌లను పునరుద్ధరిచుకోలేదని గుర్తుచేసింది. ముంబయి హై అండ్ బేసిన్ ఫీల్డ్‌లో చమురు ఉత్పత్తి 28శాతంగా ఉందని, బీజీ గ్రూప్ వెనక్కితగ్గగానే పన్నా, ముక్తా, తపతి క్షేత్రాలను ఓఎన్జీసీ స్వాధీనం చేసుకుందని యూనియన్ తెలిపింది. ఆమోదించినదానికన్నా ఎక్కువమొత్తంలో అక్కడ చమురు ఉత్పత్తి చేస్తున్నామని యూనియన్ లేఖలో వెల్లడించింది. తమ సూచనలు తెలిపేందుకు హర్దీప్ సింగ్‌తో సమావేశమయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరింది.