Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముకేశ్ అంబానీతో ఆరామ్కో తెగదెంపులు
న్యూఢిల్లీ : ముకేశ్ అంబానికి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్తో ఒప్పందాన్ని నిలిపివేసుకుంటున్నట్టు సౌదీకి చెందిన ఆరామ్కో తెలిపింది. భారత్లో దీర్ఘకాలంలో పెట్టుబడుల వద్ధికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తామే స్వయంగా కొత్త పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నామని తెలిపింది. రిలయన్స్ ఇండిస్టీస్ తన ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్, ఆయిల్ రిటైలింగ్ వ్యాపారంలో కొంత వాటాను సౌదీ ఆరామ్కోకు విక్రయించాలని కొంతకాలం క్రితం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గుజరాత్లోని జామ్నానగర్లోని రెండు రిఫైనరీల్లో, పెట్రోకెమికల్స్ వ్యాపారంలో 20 శాతం, ఆయిల్ రిటైలింగ్ జాయింట్ వెంచర్ అయిన బ్రిటిష్ పెట్రోలియం (బీపీ)లో 51 శాతం వాటా సౌదీ ఆరామ్కోకు ఇవ్వాలని భావించింది. ఈ లావాదేవీ గత ఏడాది మార్చి నాటికే పూర్తికావలసి ఉండగా.. కరోనా మహమ్మారి వల్ల ఆలస్యమైంది. తాజాగా దీన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఆరామ్కో తెలపవడంతో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇండిస్టీస్ షేర్లు భారీగా పడిపోయాయి.