Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పటికే ప్రజలు సతమతమవుతోంటే మరోవైపు త్వరలోనే గృహోపకరణాలు, దుస్తుల ధరలు పెరగనున్నాయి. వచ్చే నెల నుంచి టీవీలు, ఏసీలు, స్మార్ట్ఫోన్లు, దుస్తుల ధరలు భారం కానున్నాయి. ముడిపదార్ధాల ఖర్చులు గణనీయంగా పెరగడంతో ధరల పెంపును నివారించలేని పరిస్ధితి నెలకొందని గోద్రెజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. గతేడాది నుంచి నూలు ధరలు 60 శాతం పైగా పెరగడంతో దుస్తుల పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుందనీ.. దీంతో వస్త్రాల ధరలూ పెంచకతప్పని పరిస్ధితి ఉందని నోయిడా అపరెల్ ఎక్స్పోర్ట్ క్లస్టర్ అధ్యక్షుడు లలిత్ దుక్రాల్ పేర్కొన్నారు.