Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : పట్టణ ప్రాంతాల్లో నిరుపేదల ఆయుర్దాయం తక్కువగా వుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లోని సంపన్నులతో పోల్చి చూస్తే పేదల్లో ఆయుర్దాయం విషయంలో పురుషులు, మహిళల మధ్య వరుసగా 9.1, 6.2 ఏళ్ల తేడా వుందని ఇటీవల అజీం ప్రేమ్జీ వర్శిటీ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 17 ప్రాంతీయ ఎన్జిఓలతో కలిసి ఈ వర్శిటీ అధ్యయనాన్ని నిర్వహించింది. పట్టణ భారతంలో ఆరోగ్య సంరక్షణ సమానత్వం శీర్షికతో నివేదికను వెలువరించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నెలకొన్న అసమానతలు, ఆరోగ్యపరమైన సున్నిత పరిస్థితులను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. ఆరోగ్యసంరక్షణ సేవలు అందుబాటులో వుండే పరిస్థితులు, వాటికయ్యే వ్యయం వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్నారు. దేశంలోని మూడవ వంతు మంది ప్రజలు ఈనాడు పట్టణాల్లో నివసిస్తున్నారు. ఈ సంఖ్య 1960లో 18శాతంగా వుండగా, 2001లో 28.53శాతం వుంది. 2019 వచ్చేసరికి 34శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 30శాతం మంది పేదలేనని అధ్యయనంలో వెల్లడైంది. ముంబయి, బెంగళూరు, సూరత్, లక్నో, గువహటి, రాంచి, ఢిల్లీ వంటి పలు నగరాలు, పట్టణాల్లో సవివరమైన రీతిలో అధ్యయనం సాగింది. పేదలపై భారీగా ఆర్థిక భారం పడడం, ఆరోగ్యసంరక్షణా రంగంలో పట్టణ స్థానిక సంస్థలు తక్కువ పెట్టుబడులు వంటివి కూడా కారణాలుగా వున్నాయని పేర్కొంది.