Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసమ్మతి తెలిపిన ఏడుగురు ప్రతిపక్ష ఎంపీలు
- పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న నివేదిక
న్యూఢిల్లీ : వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ముసాయిదా నివేదికను ఆమోదించింది. ఈ నివేదికను రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో సమర్పించనున్నది. అలాగే దీనికి ఏడుగురు ప్రతిపక్ష సభ్యులు అసమ్మతి తెలుపుతూ లేఖలు ఇచ్చారు. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు (పీడీపీ)-2019ను పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశం కమిటీ చైర్మెన్ పీపీ చౌదరి నేతృత్వలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో మెజార్టీ ఓట్లతో కమిటీ ముసాయిదా నివేదికను ఆమోదించింది. కాంగ్రెస్ ఎంపీలు జైరామ్ రమేశ్, మనీశ్ తివారీ, గౌరవ్ గొగోరు, వివేక్ తంఖా, టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓ బ్రియన్, మహువా మోయిత్రా, బీజేపీ ఎంపీ అమర్ పట్నాయక్‌తో కూడిన ఏడుగురు ప్రతిపక్ష ఎంపీలు అసమ్మతి తెలిపారు. ఈ మేరకు కమిటీ చైర్మెన్, బీజేపీ ఎంపీ పిపి చౌదరికీ అసమ్మతి లేఖలు ఇచ్చారు.
రెండేండ్ల చర్చల తరువాత బిల్లుపై ముసాయిదా నివేదిక ఖరారు..
సిఫారసులతో కూడిన ముసాయిదా నివేదికను ఇప్పుడు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్ ముందు ఉంచే అవకాశం ఉంది. కమిటీ మాజీ చైర్పర్సన్ మీనాక్షి లేఖిని మంత్రిగా పదోన్నతి కల్పించడంతోపాటు కమిటీకి కొత్త చైర్‌పర్సన్‌ను నియమించడం వల్ల ప్యానెల్ నివేదికను ఆలస్యం చేసింది. ఈ బిల్లు ''దేశంలో భద్రపరచబడే సున్నితమైన వ్యక్తిగత డేటాను అందిస్తుంది. డేటా విశ్వసనీయతలను భద్రతలు, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది. ఇది సమ్మతిని ఉపసంహరించుకునే హక్కుతో సహా డేటా విశ్వసనీయతలకు సంబంధించి వ్యక్తుల హక్కులను నిర్దేశిస్తుంది'' అని కేంద్రం తెలుపుతుంది. ''వ్యక్తిగత హక్కులను పరిరక్షించడానికి, సమ్మతిని నిర్ధారించడానికి తప్పనిసరిగా డేటా ప్రొటెక్షన్ అథారిటీని బిల్లు అందిస్తుంది. అంతేకాకుండా ఇది ఉల్లంఘనలకు సంబంధించిన కొన్ని సందర్భాల్లో వార్షిక టర్నోవర్‌లో 4 శాతం వరకు జరిమానాలను వేస్తుంది. జాతీయ భద్రత, పబ్లిక్ ఆర్డర్ కేసులలో ప్రభుత్వానికి మినహాయింపు ఉంటుంది'' అని తెలిపింది.
అయితే, ఆ మినహాయింపును అనుమతించే బిల్లుపై ఏడుగురు ప్రతిపక్ష సభ్యులు తమ భిన్నాభిప్రాయాలను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రతిపక్ష నేతలు అసమ్మతి లేఖల ప్రకారం ''పీడీపీ బిల్లు ప్రయివేట్ రంగానికి సంబంధించి మాత్రమే గోప్యత హక్కు పుడుతుంది. ప్రభుత్వాన్ని, సంబంధిత సంస్థలను ప్రత్యేక తరగతులుగా పరిగణిస్తుంది'' అని పేర్కొన్నారు. ''దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత, స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా చట్టం పరిధి నుంచి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అన్ని ఏజెన్సీలను మినహాయించటానికి ప్రభుత్వం అనుమతించే బిల్లులోని సెక్షన్ 35 అనుమతి ఇస్తుంది. సెక్షన్ 35 ఏదైనా ప్రభుత్వ సంస్థను సమ్మతి నుంచి మినహాయించటానికి కేంద్రానికి హద్దులేని అధికారాలను ఇస్తుంది'' అని వారు ఆ లేఖల్లో తెలిపారు. ప్రభుత్వ సంస్థలను మినహాయించే ముందు పార్లమెంటరీ అనుమతిని కోరేందుకు తాము సవరణను ప్రతిపాదించామని వారు తెలిపారు. కొత్త డేటా ప్రొటెక్షన్ విధానంలోకి వెళ్లేందుకు ప్రయివేట్ కంపెనీలకు రెండేండ్ల వ్యవధిని జేపీసీ నివేదిక అనుమతించిందనీ, అయితే ప్రభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలకు అలాంటి నిబంధనలు లేవని అసమ్మతి నోట్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఏకాభిప్రాయం లేని డేటా ప్రాసెసింగ్‌కు సెక్షన్ 12 అనుమతిస్తుందని తెలిపారు. సెక్షన్ 35, సెక్షన్ 12లు పార్లమెంటరీ పర్యవేక్షణకు విరుద్ధమనీ, పార్లమెంటరీ నిబంధనల ఉల్లంఘన అని పేర్కొన్నారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు-2019 రూపకల్పన ప్రకారం ప్రయివేట్ కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన చోట మాత్రమే గోప్యతకు రాజ్యాంగ హక్కు ఏర్పడుతుందని వారు వాదించారు. రాష్ట్ర స్థాయి డేటా ఎక్సాస్ ప్రొటోకాల్ (డీఏపీ)లను బిల్లులో చేర్చకపోవడంపై బీజేడీ ఎంపీ పట్నాయక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కమిటీతో తమ ప్రతినిధుల సమావేశాల సందర్భంగా ఈ మేరకు కోరాయి. రాష్ట్ర డేటా ప్రొసెసింగ్ అగ్రిమెంట్లు (డీపీఏ)లు లేకపోవడం సమాఖ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని స్పష్టం చేశారు. ఈ కమిటీలో 30 మంది సభ్యులుగా ఉండగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా సభ్యులుగా ఉన్నారు.