Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుప్పకూలిన మార్కెట్లు
- సెన్సెక్స్ 1170 పాయింట్ల పతనం
- మదుపర్లకు రూ.8 లక్షల కోట్ల నష్టం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బేర్‌మంటున్నాయి. వరుసగా నాలుగో సెషన్లోనూ నేల చూపులు చూశాయి. గడిచిన ఏప్రిల్ నుంచి ఎప్పుడూ లేని స్థాయిలో సోమవారం భారీ నష్టాలు చవి చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,170.12 పాయింట్లు లేదా 1.96 శాతం పతనమై 58,466కు దిగజారింది. దలాల్ స్ట్రీట్‌పై బేర్ పంజాతో ఒక్క పూటలోనే మదుపర్ల సంపద రూ.7.86 లక్షల కోట్లు ఆవిరయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 348.25 పాయింట్లు లేదా 1.96 శాతం కోల్పోయి 17,416.55 వద్ద ముగిసింది. మార్కెట్లకు మరో బ్లాక్ మండేగా మిగిలిపోయింది. ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచే సూచీలు నేల చూపులు పట్టగా.. ఏ దశలోనూ కొలుకొనలేదు. అంతర్జాతీయ బలహీనతలకు తోడు ద్రవ్యోల్బణ భయాలు మార్కెట్లను కుదేలు చేశాయి. ఓ దశలో సెన్సెక్స్ 1,766 పాయింట్లు కోల్పోయి 58,012 కనిష్టానికి పడిపోయింది. గడిచిన నాలుగు సెషన్లలో ఈ సూచీ ఏకంగా 2,253 పాయింట్లు లేదా 3.7 శాతం నష్టపోయింది. సెన్సెక్స్-30లో రిలయన్స్ 4 శాతం విలువ కోల్పోగా.. బజాజ్ ఫినాన్స్ అత్యధికంగా 6 శాతం నష్టపోయింది. బజాజ్ ఫినాన్స్ 5 శాతం పడిపోయింది. ఎన్టీపీసీ, టైటన్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, మారుతి సూచీలు 3-4 శాతం మేర క్షీణించాయి. మరోవైపు మొబైల్ చార్జీలు పెంచుతు న్నట్టు భారతీ ఎయిర్టెల్ ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్ 4 శాతం పెరిగింది. ఆసియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సూచీలు మాత్రమే లాభపడ్డాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 2.5 శాతం, 2.9 శాతం చొప్పున నష్టపోయాయి.
దెబ్బతీసిన అంశాలు..
యూరప్, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కరోనా కేసులు పెరగడంతో అక్కడి ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలను మరోసారి కఠినతరం చేస్తున్నాయి. ఈ పరిణామం మదుపర్లలో విశ్వాసం సన్నగిల్లేలా చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగడం భారత సూచీల్లో మరింత ప్రతికూలతను పెంచింది. మరోవైపు భారత్‌లో రిటైల్, టోకు ధరల మోత ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేసింది. రిలయన్స్-ఆరామ్కో కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం రద్దు అయ్యింది. ఈ రద్దుతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెర లేపారు. ఈ దెబ్బతో రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ 4.42 శాతం క్షీణించి రూ.2,363.40కు పడిపోయింది.