Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విస్మరిస్తే ప్రభుత్వాలు మనుగడ సాధించలేవు : సీఐటీయూ
అమరావతి : ఓ వైపున భారీ వర్షాలు, వరదలతో అస్తవ్యస్తంగా మారినరవాణా వ్యవస్థ మరోవైపు ప్రభుత్వం కల్పించిన అడ్డంకులు! అయినా వీటన్నింటిని అధి గమించి అంగన్వాడీలు కదం తొక్కారు. సమస్యలు పరిష్కరించాలని నినదించారు. సీఐటీయూ అనుబంధ సంఘమైన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు సోమవారం తరలివచ్చిన వేలాదిమంది అంగన్వాడీలు, హెల్పర్లతో విజయవాడ కిటకిటలాడింది. ధర్నాచౌక్‌కు వెళ్లే వీధుల్లో ఎక్కడ చూసినా అంగన్వాడీలే కనిపించారు. అలంకార్ సెంటర్, సాంబమూర్తి రోడ్ కిటకిటలాడింది. దీంతో ట్రాఫిక్ పోలీస్‌లు సాంబమూర్తి రోడ్‌ను మూసివేసి ట్రాఫిక్‌ను మళ్లించారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేసిన నినాదాలతో ధర్నాచౌక్ మారుమ్రోగింది. భారీ సంఖ్యలో అంగన్వాడీలు తరలిరావడంతో మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు స్పందించారు. ఆ శాఖ ఆర్జెడి ఉమాదేవి ధర్నా శిబిరం వద్దకు వచ్చారు. వినతిపత్రం స్వీకరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తేలికగా తీసుకుంటోందని అన్నారు. ఎన్నికలకు ముందు అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు.