Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరలో కొత్త బిల్లు : అసెంబ్లీలో జగన్
అమరావతి : మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం తెలిపారు. కాగా, ఈ బిల్లు ఉపసంహరణపై అసెం బ్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వివరణనిచ్చారు. రాష్ట్ర ప్రజల అందరి శ్రేయస్సు రీత్యా అధికార వికేంద్రీకరణ లక్ష్యంతో మరింత సమగ్రమైన బిల్లుతో ముందుకు వస్తామని ప్రకటించారు. తామ ఆమోదించిన మూడు రాజధానుల చట్టం, అభివద్ధి వికేంద్రీకరణ చట్టంపై విష ప్రచారం చేశారనీ, న్యాయపరమైన అడ్డంకులను సష్టించారనీ అన్నారు. అంతకు ముందు మూడు రాజధానుల చట్టం, అభివృద్ది వికేంద్రీకరణ చట్టం ఉపసంహరణకు సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఉండేదని, గుంటూరులో హైకోర్టు ఉండేదని అన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనీ, రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి దశలో పయనించాలనే ఉద్దేశంతో విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలనీ, ఈ ప్రాంతంలో లెజిస్లేచివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ పెట్టాలని నిర్ణయించామన్నారు. గతంలో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది శ్రీకృష్ణ కమిటీ నిబంధనలతో పాటు పలు నిబంధనలను ఉల్లంఘించి చంద్రబాబు రాజధాని ఎంపిక చేశారు. ఈ ప్రాంతమంటే నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. నా నివాసం కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం విజయవాడకు, గుంటూరుకు 40 కి.మీ దూరంలో ఉంది. రోడ్లు, డ్రైనేజి, కరెంటు వీటన్నింటికోసం లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఈ లక్ష కోట్లు ఏడు లక్షల కోట్లకు మించవచ్చు. మన దగ్గరున్న డబ్బుతో మౌలిక సదుపాయాలను కల్పించలేమన్నారు. ఏపీలో అతి పెద్ద నగరం విశాఖ. ఇప్పటికే అన్ని వసతులు ఉన్నాయి. వాటిపై కొద్ది మోత్తాన్ని కేటాయిస్తే. హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడటానికి అవకాశం ఉంటుంది. వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రజల సదుద్దేశాన్ని విస్తృతంగా వివరించేందుకు, మరిన్ని మార్పులతో పరిపుష్టి చేసేందుకు గతంలో ప్రవేశ పెట్టిన బిల్లులను వెనక్కు తీసుకున్నాం. విస్తృత, విశాల ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు మరోసారి బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాం. బిల్లుల్లో సమగ్రంగా మార్పులు చేసి మళ్లీ తీసుకువస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.