Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి.రమణ
- శ్రీ అట్టహాసంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవం
అనంతపురం : ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులని, పాలకులు ఏ నిర్ణయం చేసినా వారికి మేలు చేసే విధంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి.రమణ పేర్కొన్నారు. సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవ వేడుకలు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సోమవారం అట్టహాసంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజ రైన జస్టిస్ రమణ మాట్లాడుతూ సమాజ పురోభివృద్ధికి విద్యే ప్రధానమైందని పేర్కొన్నారు. పాలకులు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉండకూడదన్నది రామాయణం, మహాభారతాల్లో వివరించారన్నారు. అయోధ్యకాండలో రాముడిని కలిసేందుకు భరతుడు వెళ్లిన సమయంలో... 'నీవు పెద్దలను గౌరవిసు ్తన్నావా? ప్రజలను బాగా చూసుకుంటున్నావా? నీ రక్షణలో ఉన్న బలహీనులు, వృద్ధులు, మహిళలకు రక్షణనిస్తున్నావా? ప్రజల అవసరాలకు తగ్గట్టు చర్యలు తీసుకుంటున్నావా? అని రాముడు అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆగ్రహం, దురుసుతనం, విజ్ఞుల మాట వినకపోవడం, ఎవరో చెప్పిన సలహాలు పాటించడం, దుష్టులను కాపాడే ప్రయత్నం చేయడం, అనాలోచిత నిర్ణయాలు చేయడం వంటివి పాలకుల్లో ఉంటే, వాటిని రోజువారీ పరిశీలించి వదించుకోవాలని అన్నారు. 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 24 మంది విద్యార్థులకు డాక్టరేట్లు, 465 మందికి డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీతురాజ్ అవాస్థి, ఛాన్సలర్ చక్రవర్తి, వైస్ ఛాన్సలర్ సిబి.సంజీవ జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి రమేష్, సత్యసాయి ట్రస్టు సభ్యులు రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.