Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, జమ్మూకాశ్మీర్ కోలిషన్ ఆఫ్ సివిల్ సొసైటీ (జేకేసీసీఎస్) ప్రొగ్రామ్ కోఆర్డినేటర్ ఖుర్రం పర్వేజ్ అరెస్టయ్యారు. తీవ్రవాదులకు నిధులు చేరవేస్తున్న కేసుకు సంబంధించి సోమవారం ఆయన నివాసంతో పాటు, కార్యాలయంలో దాడులు నిర్వహించిన అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పర్వేజ్‌ను అదుపులోకి తీసుకుంది. నేరపూరిత కుట్ర, ఉగ్రవాద చర్యలకు నిధుల సేకరణ, నేరాలకు పాల్పడే కుట్రలు వంటి ఆరోపణలతో పలు సెక్షన్ల కింది కేసు మోపారు. అలాగే, ఉపా చట్టం కింద కూడా ఆయనపై కేసు నమోదుచేశారు. పర్వేజ్ కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్ఐఏ అధికారులు 7:45 గంటలకు ఆయన నివాసానికి చేరుకునీ, ప్రశ్నించడం మొదలుపెట్టారు. పలు పత్రాలు, ఎలాక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.