Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి రహిత సేవల్లో టాప్‌లో కేరళ
- థింక్ ట్యాంక్ ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలపై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ సర్వే నిర్వహించింది. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్.. స్మార్ట్ పోలీసింగ్ సర్వే-2021 విడుదల చేసింది. ప్రజలతో సంబంధాలు, సహకారం, సాంకేతికత, చట్టబద్ధత, అవినీతి అంశాలపై సర్వే నిర్వహించింది. ఈ ఇండెక్స్‌లో దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన స్కోర్‌ను సాధించగా, ఉత్తరాది రాష్ట్రాలు అత్యల్ప స్కోర్లతో అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ విడుదల చేసిన సర్వే వివరాల ప్రకారం.. దేశంలో స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్‌లో అత్యల్ప స్కోర్‌తో బీహార్ (5.74) అట్టడుగు స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ (5.81), జార్ఖండ్ (6.07), ఛత్తీస్‌గఢ్ (5.93) రాష్ట్రాలు ఉన్నాయి. పలు అంశాల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రథమ, ద్వితీయ స్థానంలో ఉన్నాయి. స్మార్ట్ పోలీసింగ్ అన్ని అంశాల్లో ఏపీకి తొలిస్థానం, తెలంగాణకు రెండోస్థానం లభించింది. సాంకేతిక వాడకంలో తెలంగాణకు మొదటి స్థానం వచ్చింది. అవినీతి రహిత సేవల్లో కేరళ పోలీసింగ్‌కు మొదటిస్థానం దక్కింది.