Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర ఒత్తిడిలో ప్రతి ఐదుగురులో ముగ్గురు
- ప్రపంచ సగటు కంటే భారత్లోనే ఎక్కువ
- హెల్త్ ఆన్ ఇండియా
-2021 మార్ష్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలోని 59 శాతం మంది ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఒత్తిడికి గురవుతున్నట్టు మార్ష్ నివేదిక స్పష్టం చేసింది. ఇది ప్రపంచ సగటు కంటే ఎక్కువని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం మంది ఉద్యోగులు,ఆసియాలో 51 శాతం మంది ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఒత్తిడికి గురవుతున్నట్టు సర్వే నివేదిక పేర్కొంది. మార్ష్ సంస్థ హెల్త్ ఆన్ డిమాండ్ ఇండియా-2021 సర్వే నివేదికను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాలలో 14,000 మంది ఉద్యోగులను వారి ఆరోగ్యం, శ్రేయస్సు విషయాలపై సర్వే చేసింది. దేశంలోని ఐదుగురిలో ముగ్గురు ఉద్యోగులు (59 శాతం) రోజువారీ ప్రాతిపదికన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు నివేదిక పేర్కొంది. ఇది ప్రపంచ, ఆసియా దేశాల సగటు కంటే ఎక్కువని నివేదిక తెలిపింది. ఏదేమైనా, దేశంలోని 27 శాతం మంది ఉద్యోగులు మహమ్మారి వల్ల ఎక్కువగా, పూర్తిగా ప్రతికూల ప్రభావంగా చూశారు. ఇది ప్రపంచ సగటు కంటే తక్కువ స్థాయి. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం మంది ఉద్యోగులు కోవిడ్-19ని ఎక్కువగా, పూర్తిగా ప్రతికూల ప్రభావంగా చూశారు. అయితే ఆసియా ఖండంలో ఇది 28 శాతంగా ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా 50 శాతం ఉద్యోగులు, ఆసియాలో 51 శాతం ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఒత్తిడికి గురవుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. ''యజమానుల నుంచి తమకు మద్దతు ఉన్నదని 21 శాతం ఉద్యోగులు పేర్కొనగా, 44 శాతం మంది ఉద్యోగులు తమకు మద్దతు లేదని పేర్కొన్నారు. మహమ్మారి సమయంలో అందించబడిన మద్దతు ఉద్యోగుల శ్రేయస్సు, విధేయతపై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంది. సర్వే ప్రకారం దేశంలో 2021లో 53 శాతం మంది ఉద్యోగులు తమ యజమాని తమ శ్రేయస్సు గురించి శ్రద్ధ వహిస్తున్నారని భావించారు. అయితే మహమ్మారి ముందు 2019లో 58 శాతం మంది ఉద్యోగులు తమ యజమాని తమ శ్రేయస్సు గురించి శ్రద్ధ వహిస్తున్నారని భావించారు. ప్రపంచ వ్యాప్తంగా గణాంకాలు 2021లో 46 శాతం, 2019లో 49 శాతం మంది ఉద్యోగులు యజమానులు తమ శ్రేయస్సు గురించి శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు.