Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 543 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. మంగళవారం ఉదయం వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 7,579 కొత్త కేసులు వెలుగు చూసాయి. 236 మంది మరణించారు. సోమవారం 9,64,980 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహి ంచారు. కేరళలో 3,698 కొత్త కేసులు నమోదు కాగా, 180 మంది మరణించారు. మొత్తంగా దేశంలో 3.45 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా, 4,66,147 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,13,584 గా ఉంది. సోమవారం 12,202 మంది కోలుకున్నారు. అలాగే సోమవారం 71,92,154 మంది టీకా వేయించుకున్నారు. దేశంలో ఇప్పటివరకు 117 కోట్ల టీకా డోసులు వేసినట్లు కేంద్ర తెలిపింది.