Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీర్మానానికి ఆమోదం కొనసాగించాలని నిర్ణయించాం : బుగ్గన
అమరావతి : మూడు రాజధానులకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును వెనక్కు తీసుకున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలిని రద్దు చేస్తూ గతేడాది జనవరి 27న చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు మండలి రద్దు ఉపసంహరణ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. 'జనవరి 27, 2020న కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశాం. దానిని కేంద్రానికి పంపాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు ఎక్కడ ఉందో ఇప్పుడూ అక్కడే ఉంది. దీంతో ఇన్నాళ్లు ఒక సందిగ్థత నెలకొంది. దానిని తొలగించి మండలిని కొనసాగించాలని నిర్ణయించాం' అని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ అన్నారు శాసనసభలో కూడా ఎక్కువమంది చదువుకున్నవారు డాక్టర్లు, న్యాయవాదులు, ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు ఉండటంతో మంచి నిర్ణయాలు చేయడానికి వారు సరిపోతారనే ఉద్దేశ్యంతో అప్పట్లో రద్దు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆ నిర్ణయాన్ని కేంద్రానికి పంపామని, అక్కడ ఎటువంటి చర్యలూ తీసుకోక పోవడంతో తీర్మానం ముందుకు పోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో మండలిని పునరుద్ధరించాలని అనుకున్నామ ని పేర్కొన్నారు. మండలిలోకి అర్హులైన, విద్యావంతులను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని అన్నారు. ఇటీవల ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ను ఎన్నుకున్నామని, ఆయన కౌన్సిలరుగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తని వివరించారు. ఓ సాధారణ దళిత కుటుంబంలో పుట్టిన ఆయనను మొట్టమొదటి దళిత ఛైర్మన్‌గా చరిత్ర సృష్టించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసే నిర్ణయాలను ముందుకు తీసుకుపోయేందుకు మండలి అవసరమని భావించామని మంత్రి వివరించారు.
2006లో వైఎస్ఆర్ పునరుద్ధరించారు
1958లో రాజ్యాంగంలోని 168వ ఆర్టికల్ కింద పేర్కొనబడిన మండలిని 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టిఆర్ వివిధ కారణాలవల్ల రద్దు చేయగా 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పునరుద్దరించారన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వారే సుప్రీమ్ అని, అయితేచ మంచి సూచనలు,సలహాలు ఇవ్వడానికి మండలి ఉపయోగపడుతుందని అన్నారు.