Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర సర్కార్‌పై సుప్రీం ఆగ్రహం
- స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా చేపట్టడంపై విచారణ
న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికలు(నవంబర్ 25న) దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇందుకోసం చేస్తున్న ఏర్పాట్లు ఏంటో తెలియజేయాలని త్రిపుర సర్కార్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు కల్పించాల్సిన భద్రత, ఇతర చర్యలపై ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుకాలేదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)సుప్రీంకోర్టులో 'కంటెంప్ట్ పిటిషన్' వేసింది. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.త్రిపురలో శాంతిభద్రతల పరిస్థితి రోజురో జుకీ దిగజారుతోందని పిటిషన్లో టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈనేపథ్యంలో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలేంటో తెలియజేయాలని త్రిపుర సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈఅంశంపై సమగ్ర ప్రకటన చేయాలని సీఎం విప్లవ్‌దేవ్‌ను ఆదేశించిం ది.''మేం చేయగలిగేది ఏముందంటే మీకు ఒక గంటన్నర సమయం ఇవ్వడం. ఇవాళ, రేపు పోలింగ్ బూత్‌ల వద్ద భద్రతకోసం తీసుకుంటున్న చర్యలు, పోలింగ్ రోజు నుంచి ఫలితాలు వెల్లడించేంత వరకూ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలపై పోలీసులు, హోం సెక్రటరీ నుంచి స్పష్టత తీసుకోండి.స్పష్టమైన సమాచారం తీసుకొని మధ్యా హ్నం12.45 గంటలకు తిరిగి మాకు తెలియజేయం డి'' అని కోర్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మహేష్ జెఠ్మలానీని ఆదేశించింది.విచారణ సందర్భంగా టీఎంసీ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, త్రిపురలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నా రు. ''మేం సమర్పించిన స్క్రీన్షాట్లలో హింస జరిగిన ప్పుడు పోలీసులు అచేతనంగా నిలబడి ఉండటం చాలా స్పష్టంగా మీరు చూడొచ్చు'' అని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవద్దని మహేష్ జెఠ్మలానీ సుప్రీంకు తెలిపారు. అయితే జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం స్పందిస్తూ..''ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు మీరు (ప్రభుత్వం) తీసుకుం టున్న చర్యలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాం. కౌంటింగ్ ఎప్పుడు? కౌంటింగ్ రోజు ఎలాంటి అనుచిత ఘటనలు చోటుచేసుకోకుండా ఇవాళ మీరు తీసుకుంటున్న చర్యలేంటి'' అని అడిగింది.