Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు (నవంబర్ 29న) మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు చేస్తూ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్ట పట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సభా కార్యకలాపాల జాబితాలో పేర్కొంది. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021ను ఆ రోజు సభ కార్యకలాపాల జాబితాలో పొందుపరిచింది. రైతు ఉత్పత్తి వ్యాపారం, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయాల కల్పన) చట్టం-2020, నిత్యావసర వస్తువుల (సవరణ) చట్టం-2020, రైతుల ధర హామీ, సేవలు ఒప్పందం (సాధికారిత, రక్షణ) చట్టం-2020లను రద్దు చేస్తూ 29న బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 2020 సెప్టెంబర్లో పార్లమెంట్ చేసిన ఈ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చట్టాలకు సంబం ధించిన ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటి నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు.