Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేపీసీలో విభేదాలు
- అసమ్మతి నోట్ సమర్పించిన ఆర్గురు సభ్యులు
న్యూఢిల్లీ : వ్యక్తిగత గోప్యతపై ప్రభుత్వ పెత్తనానికి సంబంధించి సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ)లో విభేదాలు తలెత్తాయి. అధికార పార్టీ సభ్యులు ఏకాభిప్రాయానికి తిలోదకాలిచ్చి ఏకపక్షంగా దీనికి ఆమోదం తెలపడంతో ఆర్గురు సభ్యులు తమ అసమ్మతిని తెలియజేస్తూ నోట్లు సమర్పించారు. వ్యక్తిగత గోప్యతపై ప్రభుత్వానికి అధికారం ఉండాలన్న వివాదాస్పద నిబంధనను తొలగించాలని వారు ఆ అసమ్మతి నోట్లో స్పష్టం చేశారు. స్వల్ప సవరణతో కమిటీ ఆ క్లాజును అలాగే అట్టిపెట్టింది. సురక్షితమైన దేశం మాత్రమే వ్యక్తిగత స్వేచ్ఛకు, వ్యక్తి గోప్యతకు హామీ కల్పించగలుగుతుందని కమిటీ (జేపీసీ) తన నివేదికలో సెలవిచ్చింది. అవసరమనుకుంటే ప్రభుత్వ సంస్థల్లో వేటినైనా ఈ చట్టం పరిధికి వెలుపల వుంచేందుకు ప్రభుత్వాన్ని అనుమతిస్తున్న 2019 నుండి ఈ నివేదికపై కమిటీ చర్చలు జరుపుతూనే వుంది. అయితే కమిటీలోని 30మంది సభ్యుల్లో ఆరుగురు మాత్రం ఈ క్లాజుపై తమ అసమ్మతి తెలియచ ేస్తూ నోట్లు సమర్పించారు. మరికొద్ది రోజుల్లో మరో ఇద్దరు సభ్యులు కూడా అసమ్మతి నోట్లు అందచేయనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మినహాయింపు క్లాజుపై కమిటీ సమావేశాల్లో చాలా వివరంగానే చర్చ సాగింది. ''ప్రజా భద్రత, సార్వభౌమాధికారం, విదేశాలతో స్నేహ సంబంధాలు, దేశ భద్రత'' పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏ సంస్థపైనైనా ఈ క్లాజును ఉపయోగించవచ్చు. అయితే మినహాయింపునకు కారణాల్లో 'ప్రజా భద్రత' అనే పదాన్ని తొలగించాలని సభ్యులు వాదించారు. ఇలాంటి మినహాయింపులు ఇవ్వాలంటే జ్యుడీషియల్ లేదా పార్లమెంటరీ పర్యవేక్షణ వుండాలని కూడా వారు పట్టుబట్టారు. బిల్లు పరిధి నుండి ఒక సంస్థను మినహాయిస్తున్నందుకు గల కారణాలను రాతపూర్వంగా ఇవ్వాలని కూడా సభ్యులు సూచిం చారు. అవసరమనుకుంటే పాక్షికంగానే మినహా యింపు వుండాలని కూడా మరికొంత మంది సభ్యులు సూచించారు.అయితే ఈ సూచనల్లో వేటినీ కూడా తుది నివేదికలో ఆమోదించ లేదు. జాతి భద్రత,స్వేచ్ఛ,వ్యక్తి గోప్యతలకు సంబంధిం చిన ఆందోళనలను సమతుల్యం చేయాల్సిన అవసరం వుందని నివేదిక వాదించి ంది. అయితే ఈ ఆందోళనలను ఎంపిక చేసుకో వడమేమీ అంత సులభం కాదని కూడా అంగీకరిం చింది.సురక్షితంగా వుండే దేశం మాత్రమే వ్యక్తిగత స్వేచ్చ ను, వ్యక్తి గోప్యతకు హామీ కల్పించగలుగుతుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛ,గోప్యత లేని చోట దేశ భద్రత కూడా నిరంకుశ పాలనకు దారి తీస్తుందని అందుకు అనేక ఉదాహరణలు వున్నాయని పేర్కొంది.
రెండు సమాంతర ప్రపంచాలేర్పడతాయి
కాంగ్రెస్ నేత మనీష్ తివారి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు గల కారణాలను వివరిస్తూ సుదీర్ఘమైన నోట్‌ను కూడా రూపొందించారు.37 క్లాజులకు ఆయన విడివిడి గా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో 35వ క్లాజుకు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపునకు అభ్యంతరం కూడా వుంది. ఈ బిల్లు సమాంతర ంగా వుండే రెండు ప్రపంచాలను సృష్టిస్తుందని, ఒకటి ప్రయివేటు రంగం కోసం, రెండోది ప్రభుత్వం కోసమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రయివేటు రంగానికి ఈ బిల్లు పూర్తి స్థాయిలో అమలవుతుందన్నారు. అదే ప్రభుత్వ వ్యవహారాల దగ్గరకొచ్చేసరికి అనేక మినహాయింపులు అమలవుతాయన్నారు. తప్పించుకునేందుకు వీలుగా వుండే పలు కారణాలు బయటకు వస్తాయన్నారు. తన అంచనా మేరకు, 2017లో సుప్రీం కోర్టుకి చెందిన 9మంది సభ్యుల ధర్మాసనం నిర్వచించిన ప్రకారం, ప్రాథమిక గోప్యతా హక్కును ఈ బిల్లు ఉల్లంఘిస్తోందని తాను భావిస్తున్నానని తివారీ స్పష్టం చేశారు.
తగిన రక్షణలు లేవు
తృణమూల్ కాంగ్రెస్ నేతలు డెరెక్ ఒ బ్రియాన్, మహువా మొయిత్రాలు సంయుక్తంగా అసమ్మతి పత్రాన్ని అందచేశారు. గోప్యతా హక్కును పరిరక్షించేందుకు ఈ బిల్లులో తగినన్ని రక్షణలు లేవని పేర్కొన్నారు. క్లాజు 35ని దుర్వినియోగపరచడానికి పూర్తి అవకాశాలు వున్నాయని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఈ క్లాజు కింద ప్రభుత్వానికి అసంబద్ధమైన అధికారాలను ఇస్తోందన్నారు.
కీలక సిఫారసులు
అన్ని సోషల్ మీడియా వేదికలను పబ్లిషర్స్గానే పరిగణించాలి. వారు ఏ సమాచారమైతే ఇస్తారో అందుకు వారు బాధ్యత వహించాలని కమిటీ సిఫారసు చేసింది. టెక్నాలజీని నిర్వహించే మాతృ సంస్థ భారత్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తప్ప ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతించరాదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరహాలోనే సోషల్ మీడియాకూ చట్టబద్ధమైన మీడియా నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాలని నివేదిక సిఫారసు చేసింది.