Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్కార్పెన్ జలాంతర్గాముల శ్రేణిలో నాలుగోది అయిన ఐఎన్ఎస్ వేలాను గురువారం భారత నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబయిలో నావెల్ డాక్‌యార్డ్‌లో నౌకదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ వేలా నౌకాదళంలో ప్రవేశించింది. స్కార్పెన్ తరగతికి చెందిన జలాంతర్గాములను ఫ్రాన్స్‌కు చెందిన నావెల్ గ్రూప్ సహకారంతో ముంబయిలోని మజగాన్ డక్ షిప్‌బిల్డర్స్ వద్ద భారత్ నిర్మిస్తోంది. అత్యంత శక్తివంతమైన ప్లాట్‌ఫారమ్‌లను, అడ్వాన్స్డ్డ్ నిఘా వ్యవస్థలను ఈ స్కార్పెన్ జలాంతర్గాములు కలిగిఉంటాయి. ఈ జలాంతార్గామల్లో యాంటీ-షిప్ మిస్సెల్స్, లాంగ్ రేంజ్ గైడెడ్ టోర్పెడోస్ పొంది పర్చబడి ఉంటాయి.
అలాగే ఈ జలాంతర్గాములు అత్యుత్తమ లక్ష్య చేధనకు ఉపకరించే అత్యాధునిక సోనార్, సెన్సార్ సూట్‌ను కలిగి ఉన్నాయి. పశ్చిమ నావెల్ కమాండ్ ఆధీనంలో ఉన్న జలాంతార్గామల సమూహంలో ఐఎన్ఎస్ వేలా భాగం కానుంది. ఈ దళంలో మరొక శక్తివంతమైన ఆయుధం కానుంది. గతంలో నౌకదళంలో కీలక సేవలు చేసి, 2009లో ఉపసంహరించబడిన వేలా అనే జలాంతర్గామి పేరును ఈ నూతన జలాంతర్గామికి పెట్టారు. గత వేలాలో పని చేసిన సిబ్బంది గురువారం కార్యక్రమంలో అతిధులుగా పాల్గొనడం విశేషం.