Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్పెషల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా ఇంటర్‌పోల్ ఆసియా ప్యానెల్‌కు ఎన్నికయ్యారు. ఆసియా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతినిధిగా ఆయన గురువారం ఎన్నికయ్యారు. ఆసియా ప్రతినిధులుగా వున్న రెండు పదవులకు ఐదు దేశాల నుండి ఐదుగురు పోటీ పడ్డారు. వారిలో సిన్హా ఒకరు. ప్రస్తుతం ఇస్తాంబుల్‌లో జరుగుతున్న 89వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎగ్జిక్యూటివ్ కమిటీలో వివిధ దేశాలకు చెందిన 13మంది సభ్యులుంటారు. వీరిలో అధ్యక్షుడు, ఇరువురు ఉపాధ్యక్షులు, 9మంది ప్రతినిధులు వుంటారు. జనరల్ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలు, పరిపాలన, జనరల్ సెక్రటేరియట్ పనితీరును ఎగ్జిక్యూటివ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఏడాదిలో మూడుసార్లు సమావేశమవుతుంది. నిర్మాణ విధానాలను రూపొందిస్తుంది, దిశా నిర్దేశాన్ని చేస్తుంది. యూఏఈకి చెందిన అహ్మద్ నాజర్‌ను ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.