Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అధికార బిజెపిని ఎదుర్కొవడానికి తృణమూల్‌తో సహా ప్రతిపక్ష పార్టీలతో ఐక్యతనే కోరుకుంటున్నామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. మేఘాలయాలో ఉన్న 17 మంది ఎమ్మెల్యేల్లో 12 మందిని తృణమూల్ ఆకర్షించిన తరువాత కూడా కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహాలపై సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖార్గే పై విషయాన్ని వెల్లడించారు. 'వచ్చే పార్లమెంట్ సమావేశాల గురించి సోనియాగాంధీ నేతృత్వంలో మేం చర్చించాం. పార్లమెంట్లో మేం అనేక విషయాలను లేవనెత్తుతాం. 29న ఎంఎస్పి, రైతుల అంశాన్ని లేవనెత్తుతాం' అని చెప్పారు. అలాగే, ద్రవ్యోల్బణం, పెట్రోల్-డీజల్ ధరలు వంటి అంశాలను తృణమూల్, ఇతర పార్టీల సమన్వయంతో లేవనెత్తుతాం అని ఖార్గే చెప్పారు. మేఘాలయలో తమ పార్టీ ఎమ్మెల్యేలు తృణమూల్‌లో చేరిన సంఘటనతో పాటు కిర్తీ అజాద్ వంటి నేతకూడా తృణమూల్ చేరారు. అలాగే ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ సోనియా గాంధీని కలవడానికి కూడా ఇష్టపడ్డం లేదు. ఇలాంటి సంఘటనలు తరువాత కూడా తృణమూల్‌తో కలిసి పని చేస్తామని కాంగ్రెస్ పేర్కొనడం విశేషం.