Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలోని మధురలో వెలుగుచూసిన దారుణం
లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. కదులుతున్న కారులో ఓ బాలికపై లైంగికదాడి జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. ఆగ్రా నుంచి తిరిగి వస్తుండగా కదులుతున్న కారులో ఓ బాలికపై ఒక వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు బాలికతో కలిసి సబ్ ఇన్ స్పెక్టర్ పరీక్ష రాయడానికి ఆగ్రాకు వెళ్లారు. మళ్లీ కారులో తిరిగివస్తుండగా, ఆమెపై లైంగికదాడి చేశాడు. అనంతరం బాధితురాలిని మధురలోని కోసికలాన్ ప్రాంత శివార్లలో పడేశారని పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) శ్రీష్ చంద్ర తెలిపారు. ప్రధాన నింధితుడైన తేజ్వీర్ను పోలీసులు గురువారం అరెస్టు చేయగా, ఈ దారుణానికి సహకరించిన మరో నిందితుడు దిగంబర్ పరారీలో ఉన్నారనీ, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితులిద్దరూ హర్యానాలోని పాల్వాల్ పరిధిలోని మన్పూర్ గ్రామానికి చెందినవారని వెల్లడించారు. దీనికి ముందు బాధితురాలితో నింధితులు సోషల్ మీడియా ద్వారా పరిచయమ్యారనీ, ఆమెతో నమ్మకంగా నడుచుకుని ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామనీ, వాంగ్మూలం సైతం రికార్డు చేశామని వెల్లడించారు.