Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ నాయకులు,ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్లలో సోదాలు
జమ్మూకాశ్మీర్ : కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హల్చల్ చేసింది. షోపియాన్ జిల్లాలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్లలో ఈ సంస్థ సోదాలు నిర్వహించినట్టు ఒక వార్త సంస్థ నివేదించింది. జమ్మూకాశ్మీర్ పోలీసులు, పారామిలిటరీ సిబ్బందితో కలిసి ఎన్ఐఏ అధికారులు జిల్లాలోని వాచి ప్రాంతంలో అనేక ఇండ్లలో సోదాలు నిర్వహించినట్టు వివరించింది. ఈనెల 22న మానవ హక్కుల కార్యకర్త ఖుర్రమ్ పర్వేజ్ అరెస్టయిన విషయం తెలిసింది. అయితే, ఆయన అరెస్టయిన కొన్ని రోజులకే ఎన్ఐఏ రంగంలోకి దిగి ఈ సోదాలు నిర్వహించటం గమనార్హం. కాగా, గురువారం ఉదయం శ్రీనగర్ శివారులోని కాంత్భాగ్ క్రల్పోరాలో గల మానవ హక్కుల కార్యకర్త, అడ్వకేటు పర్వేజ్ ఇమ్రోజ్ ఇంటిలో సోదాలు జరిగినట్టు ఒక అధికారి చెప్పినట్టుగా స్థానిక వార్త సంస్థ ఒకటి పేర్కొన్నది. అయితే, ఇమ్రోజ్ కుటుంబం దీనిని తోసిపుచ్చినట్టు సమాచారం.