Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్కు 11,185 కోట్ల రుణం
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కట్టడికి సహాయం చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముందుకొచ్చింది. కరోనా నివారణ టీకాల కొనుగోలుకు భారీగా రుణం మంజూరుచేసేందుకు ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్ల సేకరణకు రూ.11,185 కోట్ల మేర రుణం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం భారత్కు ఈ రుణ సాయాన్ని మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా బుధవారం 90.27 లక్షల డోసులు పంపిణీ చేయగా, ఇప్పటిదాకా 119.38 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.